ఇంట్లో దీపం వెలిగితే ఆ ఇల్లు కలకాలం భోగ భాగ్యాలతో వెలుగులీనుతుందని చెప్పుకుంటారు. ప్రతిరోజూ దేవుడు ముందు దీపం పెట్టేవారు ఎంతోమంది. అలాగే వేడుకల సమయంలో, పండుగల సమయంలో, శుభకార్యాల సమయంలో కూడా దీపాన్ని పెడతారు. అయితే దీపం పెట్టేటప్పుడు చాలామంది ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. దీపం కింద కచ్చితంగా కొంత బియ్యాన్ని లేదా ధాన్యాలను పోయాల్సిన అవసరం ఉంది. ఆ ధాన్యాల మీదే దీపం కుందెలు పెట్టి వెలిగించాలి. అప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది.
బియ్యం
బియ్యము లేదా ధాన్యాలు అనేవి స్వచ్ఛత, పరిపూర్ణత, శ్రేయస్సుకు చిహ్నంగా చెప్పుకుంటారు. దీపం కింద బియ్యం ఉంచడం వల్ల ఇంట్లో సంపదకు ఆహారానికి కొరత ఉండదని అంటారు. అలాగే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పుకుంటారు.
గోధుమలు
దీపం కింద కేవలం బియ్యం, దాన్యాలే కాదు గోధుమలు కూడా వేసుకోవచ్చు. గోధుమలు దీపం కింద వేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు, ఆహార నిల్వలు పెరుగుతాయని అంటారు. అలాగే ఇంట్లో డబ్బు, సంపద సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి దీపం పెట్టేముందు కొన్ని గోధుమలను వేసి దానిపై ప్రమిదను పెట్టి దీపం పెట్టేందుకు ప్రయత్నించండి.
నువ్వులు
ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్టు అనిపిస్తే ఆ ఇంటి స్వచ్ఛతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు ఇంటిలో ఉన్న చెడు దృష్టిని బయటికి పంపడానికి నువ్వులు ఉపయోగపడతాయి. నువ్వులను వేసి దానిపై ప్రమిద పెట్టి దేవుళ్ళ ముందు దీపం పెట్టండి. ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. చెడు దృష్టి నుండి రక్షణ కల్పిస్తుంది. కెరీర్లో అడ్డంకులను తొలగిస్తుంది.
పెసరపప్పు
ఇంటి వాస్తు దోషాలను తొలగించడానికి కూడా దీపం ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయన్న అనుమానం వస్తే పెసరపప్పును తీసుకొని దీపం కింద వేయండి. ఆ పెసరపప్పుపై ప్రమిదను ఉంచి దీపం పెట్టండి. పెసరపప్పును శుభ ధాన్యంగా చెప్పుకుంటారు. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది.
శెనగపప్పు
శెనగపప్పు కూడా ఇంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో సంపద, ఆస్తి వంటివి కావాలంటే దీపం కింద శెనగపప్పును వేయడం మంచిది. ఇది ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించి ఆనందము, శ్రేయస్సు నెలకొనేలా చేస్తుంది.
Also Read: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? అయితే దేవుడి దయ మీపై ఉన్నట్లే!
బార్లీ గింజలు
బార్లీ గింజలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో వారికి పురోగతి కావాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా బార్లీ గింజలను ఉపయోగించండి. యజ్ఞాల్లో కూడా బార్లీ గింజలను ఉపయోగిస్తూ ఉంటారు. జీవితంలో సుఖాలు, విలాసాలు పెరగాలనుకుంటే ప్రమిద కింద బార్లీ గింజలను వేసి దానిపై ప్రమిద పెట్టి దీపం వెలిగించండి. మీ ఇంటికి అంతా మంచే జరుగుతుంది.