Big Stories

Bheemili Political War: భీమిలి కబడ్డీ ఫైట్.. జెండా పాతేది ఎవరు?

Bheemili Constituency Political War: ఎన్నికల్లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా తన గెలుపు ఎంత ముఖ్యమో.. విశాఖ ఎంపీగా తన భార్య ఝాన్సీ విజయం కూడా అంతే కీలకంగా మారింది మంత్రి బొత్సకి.. దాంతో ఆయన వారంలో మూడు రోజులు చీపురుపల్లిలో మిగిలిన రోజులు విశాఖలో గడుపుతూ నానా హైరానా పడుతున్నారు. మరీ ముఖ్యంగా భీమిలీ నుంచి పోటీ చేస్తున్న గంటా విశాఖ లోక్‌సభ స్థానంలో గండంలా మారి బొత్సకి కంటి మీద నిద్రలేకుండా చేస్తున్నారంట. ఆ క్రమంలో విశాఖ లోక్‌సభ సెగ్మెంట్ పొలిటికల్ వార్ గంటా వర్సెస్ బొత్స అన్నట్లు మారిందంట.

- Advertisement -

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మకుటం లేని మహరాజులా చలాయించే మంత్రి బొత్స సత్యానారాయణకి ఈ సారి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదంటున్నారు. ఒక గండం తప్పిందనుకుంటే ఇంకో గండం అన్నట్లు తయారైందంట ఆయన పరిస్థితి. విజయనగరం జిల్లా చీపురుపల్లిని తన అడ్డాగా మార్చుకుని పొలిటికల్ చక్రం తిప్పుతున్నారాయన. ఈ సారి చీపురుపల్లిలో బొత్సకి ఎలాగైన చెక్ పెట్టాలని పట్టుదలతో ఉన్నారు టీడీపీ అధినేత. ఆ క్రమంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని బరిలోకి దింపుతారన్న ప్రచారం జరిగింది.

- Advertisement -

తన పొలిటికల్ కెరీర్‌లో ప్రతి ఎలక్షన్‌కు సెగ్మెంట్ మారుస్తున్నా ఓటమి ఎరగని లీడర్‌గా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాసరావు ఈ సారి కూడా తాను ప్రాతినిధ్యం వహించిన విశాఖ నార్త్ నుంచి ఫిఫ్ట్ అవ్వాలని భావించారు. ఆ క్రమంలో ఆయన్ని చీపురుపల్లి నుంచి పోటీ చేయించి బొత్సాకి చెక్ పెట్టాలని భావించారు చంద్రబాబు బొత్స చీపురుపల్లికే పరిమితం చేసి … విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన భార్య ఝాన్సీ కోసం ప్రచారానికి ఎక్కువ టైం కేటాయించకుండా చేయాలని స్కెచ్ గీశారు. అయితే గంటా తాను ఆశించిన భీమిలీ టికెట్ దక్కించుకున్నారు. దాంతో ఒక గండం గడిచిందని రిలాక్స్ అయింది బొత్స వర్గం.

Also Read: రోజాకు రింగా రింగా.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..

ఇప్పుడు గంటా పోటీ చేస్తున్న భీమిలీ విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోకే వస్తుంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా వైసీపీ అభ్యర్ధి ఎంవీవీ సత్యనారాయణ 4 వేల పైచిలుకు స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. భీమిలీ నుంచి 9 వేల మెజార్టీతో గెలిచారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆ భీమిలీ మెజార్టీనే ఎంపీ స్థానంలో కీలకంగా పనిచేసింది. ఇప్పుడా ఈక్వేషన్లే బొత్సాకి నిద్రలేకుండా చేస్తున్నాయంట. అవంతి శ్రీనివాస్‌పై విజయాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న గంటా శ్రీనివాసరావు భీమిలీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీలోకి వరుసగా పెరుగుతున్న వలసలతో భీమిలీలో వైసీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది.

మాజీ మంత్రి , భీమిలి సిటింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్‌పై పార్టీ శ్రేణుల్లోనూ, నియోజకవర్గ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందంట … ఆయనపై వ్యతిరేకతతో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్దఎత్తున వలసలు కొనసాగుతున్నాయ.. పోలింగ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ పార్టీ నుంచి వలసలు మరింత పెరిగే అవకాశం కనపడుతుండటం బొత్సను తీవ్రంగా కలవరపెడుతోందంట… భీమిలిలో గంటా భారీ విజయం సాధిస్తే విశాఖ లోక్‌సభ అభ్యర్థి ఝాన్సీ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో బొత్స స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడానికి నానా పాట్లు పడుతున్నారంట.

భీమిలిలో టీడీపీని ఓడించడం లేదా మెజారిటీని వీలైనంత తగ్గించడం లక్ష్యంగా ఆ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారంట. ఆ క్రమంలో అవంతిని పక్కనపెట్టి తానే భీమిలీ అభ్యర్ధి అయినట్లు పావులు కదుపుతున్నారంట… టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కీలక నాయకుల్ని పార్టీలో కొనసాగాలని బతిమాలుతున్నారంట. ఝాన్సీని ఎలాగైనా గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బొత్స.. తన మనుషుల్ని అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించి వారంలో మూడు రోజులు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Also Read: వెంకటగిరిలో గెలుపెవరిది?

వైసీపీ నాయకులు టీడీపీలో చేరకుండా ఆపేందుకు బొత్స సర్వశక్తులూ ఒడ్డుతూ వారి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని, అవంతితో సంబంధం లేదని చెబుతున్నారంట. అవసరమైతే సీఎం జగన్‌తోనూ మండల స్థాయి నాయకులతో మాట్లాడిస్తున్నారంట. పార్టీ మారడానికి సిద్దమైన భీమిలి ఎంపీపీ ఫ్యామిలీని బుజ్జగించడానికి జగన్‌తో మాట్టాడించడాల్సి వచ్చిందంట. అయితే అవంతి శ్రీనివాస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆ నేత వైసీపీకి ఎంతవరకు మనస్ఫూర్తిగా సహకరిస్తారన్నది అనుమానమే అంటున్నారు. అదలా ఉంటే బొత్స తదితరులు ఎంతగా ప్రయత్నిస్తున్నా టీడీపీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు.

భీమిలీలో గంటా గండాన్ని ఎదుర్కోవడానికి అంత కసరత్తు చేస్తున్న బొత్సకి చీపురుపల్లిలోనూ గండం పొంచి ఉందంటున్నారు. చీపురుపల్లి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి కళావెంకట్రావుని ప్రకటించడంతో అప్పటి వరకు పార్టీ ఇన్చార్జ్‌గా ఉన్న కళా తమ్ముడి కొడుకు కిమిడి నాగార్జున కొన్ని రోజులు అలిగి పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. గత అయిదేళ్లుగా చీపురుపల్లిలో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డ నాగార్జున అలకపాన్ను ఎక్కడంతో తమ పని ఈజీ అయిందని బొత్స వర్గీయులు ఒకింత రిలాక్స్ అయ్యారు.

అయితే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా అయిన కిమిడి నాగార్జునను బుజ్జగించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయిన నాగార్జున తాజాగా చీపురుపల్లిలో జరిగిన బాలకృష్ణ పర్యటనలో తన పెద్దనాన్నతో కలిసి పాల్గొని బొత్స వర్గానికి షాక్ ఇచ్చారు. మొత్తమ్మీద చకచకా మారిపోతున్న ఈక్వేషన్లతో వరుస గండాలు ఎదురవుతున్నాయి బొత్సాకి.. మరి వాటిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News