Big Stories

Bangui Boat Tragedy: అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు.. ఫెర్రీ బోల్తా.. 58 మంది మృతి..!

58 People Died in Bangui Boat Tragedy in Central Africa: అంత్యక్రియలకు వెళ్తూ 58 మంది ప్రాణాలు పోయిన ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగూయ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. శుక్రవారం రాజధాని బంగుయ్‌లోని మ్పోకో నదిపై ఒక చెక్క ఫెర్రీలో 300 మంది అంత్యక్రియలకు బయలుదేరుతుండా ఫెర్రీ బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 58 మంది ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

స్థానిక పడవ నడిపే నావికులు, మత్స్యకారులు మొదట స్పందించి బాధితులను రక్షించారు. అత్యవసర సేవలు స్పందించేలోపు నది నుంచి మృతదేహాలను వెలికితీశారు. రెస్క్యూలో పాల్గొన్న ఒక మత్స్యకారుడు, అడ్రియన్ మొస్సామో మాట్లాడుతూ, మిలటరీ రాక కోసం వేచి ఉండగా కనీసం 20 మృతదేహాలు వెలికితీసామని.. ఇది భయంకరమైన రోజని అన్నాడు.

- Advertisement -
మృతుల సంఖ్య పెరగవచ్చు

మిలటరీ సోదాలు చేపట్టడంతో మృతుల సంఖ్య పెరుగుతోందని బాంగీ యూనివర్సిటీ హాస్పిటల్ సెంటర్ అధికారులు తెలిపారు. ప్రజా సంఘాలు, స్థానిక రాజకీయ పార్టీలు సోషల్ మీడియా పోస్ట్‌లలో తమ సంతాపాన్ని తెలిపాయి. పడవ మునిగిపోయిన ఘటనపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: వెస్ట్ బ్యాంక్ గాజాలో ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి

“సంఘటన జరిగిన 40 నిమిషాల తర్వాత మేము అప్రమత్తమయ్యాము. రక్షకులు సుమారు 58 నిర్జీవ మృతదేహాలను వెలికి తీయగలిగారు” అని పౌర రక్షణ విభాగం అధిపతి థామస్ జిమాస్సే రాయిటర్స్‌తో అన్నారు. మ్పోకో నదిలో మునిగిపోయిన ఘటనపై మరింత మంది వ్యక్తులతో శోధన కొనసాగుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News