PM Modi Inaugurates 2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav: మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం దేశ రాజధానిలోని భారత్ మండపంలో 2550వ భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపును, నాణేన్ని కూడా విడుదల చేశారు.
అంతకుముందు, ప్రధాని మోదీ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, భగవాన్ మహావీర్ శాంతి, సద్భావన సందేశం ‘విక్షిత్ భారత్’ నిర్మాణంలో దేశానికి ప్రేరణ అని అన్నారు. “మహావీర్ జయంతి శుభ సందర్భంగా దేశంలోని కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.. భగవాన్ మహావీర్ శాంతి, సంయమనం సామరస్య సందేశం ‘విక్షిత్ భారత్’ నిర్మాణంలో దేశానికి స్ఫూర్తినిస్తుంది” అని ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
#WATCH | Prime Minister Narendra Modi to inaugurate the 2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav, on the occasion of Mahaveer Jayanti, at Bharat Mandapam pic.twitter.com/nHi3AxjWpC
— ANI (@ANI) April 21, 2024
Also Read: పరీక్షలో ఫేలయ్యి.. ఫుల్లు ఫేమసయ్యాడు
మహావీర్ జయంతి జైనమత స్థాపకుడు జన్మదినాన్ని సూచిస్తుంది. జైన సంఘం శాంతి, సామరస్యాన్ని పాటించడానికి.. జైనమత 24వ తీర్థంకరుడైన మహావీరుడి బోధనలను వ్యాప్తి చేయడానికి ఈ పండుగను జరుపుకుంటుంది. ఈ పండుగ జైన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని 13వ రోజున వస్తుంది – ఈ సంవత్సరం దీనిని ఏప్రిల్ 21న జరుపుకుంటారు.
రథంపై మహావీర్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తూ.. దారిలో మతపరమైన పాటలు పారాయణం చేస్తూ మహావీర్ జయంతిని జరుపుకుంటారు. జైనులు కూడా దానధర్మాలు చేయడం, ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు పాటించడం, జైన దేవాలయాలను సందర్శించడం, సామూహిక ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం వంటివి ఈ రోజున చేస్తారు. జైన మతస్థులు ఎక్కువగా సాత్విక ఆహారం తింటారు. ఇందులో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి లేకుండా తయారు చేసిన శాఖాహారం భోజనం ఉంటుంది.