Big Stories

Mudragada vs His Daughter Kranthi: ముద్రగడ Vs కూతురు.. పంతం.. నీదా నాదా సై!

- Advertisement -

ప్రత్యక్షరాజకీయాలకు పదేళ్ల క్రితమే దూరమైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ఫోకస్ అవుతూనే ఉంటారు. ఎన్నికలకు దూరంగా ఉన్నా.. తన రూటే సెపరేటు అన్నట్లు వ్యవహరిస్తుంటారు ఆ కిర్లంపూడి లీడర్.. ఇటీవల పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన పవన్‌కల్యాణ్‌ను ముద్రగడ టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. గతంలో పవన్‌కు సన్నిహితంగా ఉంటూ.. ఆయనకు పలు సూచనలు చేసిన పద్మనాభం.. ప్రస్తుతం వైసీపీ నాయకుడయ్యారు. కొడుకు గిరితో కలిసి వైసీపీ పంచకు చేరిన నాటి నుంచి కేవలం పవన్‌ టార్గెట్‌గా పనిచేస్తూ.. జనసేనానిని ఓడించి తీరతానని సవాళ్లు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌ని ఓడించకపోతే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు.

- Advertisement -

Also Read: సొంత బంధువులే శత్రువులు.. డిప్యూటీలా ఫ్రస్టేషన్

ముద్రగడ సవాల్‌పై జనసైనికులతో పాటు కాపు సామాజిక వర్గ నేతలూ ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో కాపులంతా ఆయన చేతిలో ఉన్నట్లు మాట్లాడటం సరికాదని చురకలు అంటిస్తున్నారు. ఇదే ఇష్యూపై ఆయన సొంత కూతురు క్రాంతి కూడా తప్పుపట్టారు. కేవలం పవన్‌ను తిట్టించేందుకే సీఎం జగన్‌ తన తండ్రిని వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత తన తండ్రిని జగన్‌ పక్కన పెట్టేస్తారని వ్యాఖ్యానించారు. పవన్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న క్రాంతి.. జనసేనాని గెలుపు కోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు.

ఊహించని విధంగా కుమార్తె నుంచి స్పందన రావటంతో ముద్రగడ పద్మనాభం ఆమె స్టేట్‌మెంట్‌పై గుస్సా అయ్యారు. తాను ప్రస్తుతం వైసీపీలో ఉన్నానని ఆ పార్టీ తరపున బరిలో ఉన్న వంగా గీత విజయానికి కృషి చేస్తామని తనకు ఇంట్లో వారితో పాటు ఎవరూ బుద్దులు చెప్పనక్కర్లేదంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు ముద్రగడ. తమ కుమార్తెకు వివాహం చేసి.. వేరే ఇంటికి పంపించానని ప్రస్తుతం ఆమె తమ ప్రాపర్టీ కాదంటూ కప్పదాటు సమాధానంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు.

వైసీపీలో చేరిన తర్వాత ముద్రగడ స్వరంలో తేడా వచ్చిందని కాపు నేతలే చెప్పుకుంటున్నారు. కాపులంతా ముద్రగడ చుట్టే ఉన్నట్లుగా ఆయన భ్రమలో ఉన్నారని.. పద్మనాభంకు అంత సీన్‌ లేదంటున్నారు. మరోవైపు ముద్రగడ వ్యవహార శైలి కారణంగా వైసీపీలో ఆయన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్‌ త్రిశంసు స్వర్గంలో పడ్డట్లు తయారైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అదలా ఉంటే విజయవాడ ఎంపి బరిలో నువ్వా నేనా అంటున్నారు కేశినేని సోదరులు టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమవ్వడంతో వాయిస్ మార్చారు. విజయవాడ టీడీపీ నేతలనే టార్గెట్ చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై పొగడ్తలు కురిపిస్తూ వచ్చారు. టీడీపీలో ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి ప్రాధాన్యత పెరగడం.. తనకు ఈ సారి టికెట్ లేదని కన్‌ఫర్మ్ అవ్వడంతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగారు.

Also Read: వైసీపీ సిద్దం.. టీడీపీ సంసిద్ధం.. వెంకటగిరిలో గెలుపెవరిది..?

టీడీపీ అధిష్టానం అందరూ ఊహించినట్లుగానే కేశినేని చిన్నికి విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించింది. అన్నదమ్ములు ప్రత్యర్ధులుగా మారినప్పటి నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ డైలాగ్‌లే పేలుతూ వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ విమర్శలు చేసుకుంటూ గెలుపుపై ఎవరి ధీమా వారు ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే సడన్‌గా కేశినేని నాని తన తమ్ముడ్ని పర్సనల్‌గా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి కి టీడీపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. చార్లెస్ శోభరాజ్ ను మించిన ఘనుడంటూ తమ్ముడిపై విమర్శలు గుప్పించారు.

ఎప్పుడో శతాబ్దం క్రితం తాత స్థాపించిన కేశినేని ట్రావెల్స్‌ను రాజకీయాల్లోకి వచ్చాక మూసేసిన కేశినేని నాని .. కుటుంబ ఆస్తులకు సంబంధించి సొంత తమ్ముడ్ని టార్గెట్ చేస్తున్న తీరుపై విజయవాడ వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు .. మొత్తానికి అన్నదమ్ముల యుద్దం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News