Big Stories

Bonda Uma Happy: సీపీ పై ఈసీ వేటు.. బోండా హ్యాపీ

- Advertisement -

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణాపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ముఖ్యమంత్రి జగన్‌పై విజయవాడలో యువకుడు రాయి దాడి నేపథ్యంలోనే ఈసీ వేటు వేసినా సీపీ బదిలీ విషయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులు కూడా బలంగానే పనిచేశాయంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఎన్నికల సంఘానికి ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేస్తున్న అధికారుల జాబితాలో కాంతి రాణా కూడా ఉన్నారు. విపక్షాల ఫిర్యాదులు, ముఖ్యమంత్రిపై దాడి. అన్నీ కలిసి సీపీపై వేటు పడింది. దాదాపు మూడేళ్లుగా విజయవాడ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కాంతి రాణా పనితీరుపై ఇన్నాళ్లు విమర్శలు ఉన్నా రాజకీయ అండదండలతో విజయవాడలోనే కొనసాగారు.

- Advertisement -

Also Read: నేడు నామినేషన్ వేయనున్న సీఎం జగన్.. దస్తగిరికి భద్రత పెంపు

ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల నేతలపై తప్పుడు కేసులు పెట్టారనేందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా జగన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తూ పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలా ఓవర్ యాక్షన్ చేయబట్టే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తెలిపారు. వైసీపీ కండువా కప్పుకుని పని‌చేసే పోలీసులపై ఫిర్యాదు చేస్తామని చట్టానికి, నిబంధనలకు‌ విరుద్ధంగా పని చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోటీలో ఉన్న తాను ప్రచారానికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెడితే  ఏసీపీ, సీఐలు అనుమతి రిజక్ట్ చేస్తున్నట్లు బోండా ఉమా ఆర్‌ఓకి ఫిర్యాదు చేశారు. తాను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వీలు లేకుండా చేశారని. అడిగితే పనికిమాలిన కారణాలు, ఆంక్షలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనుకి సేవకుల్లా ఆ అధికారులిద్దరు పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మరోసారి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్ధి వెల్లంపల్లిపై దాడి ఘటన పెద్ద డ్రామా అని యద్దేవా చేశారు. ఓటమి ఖాయమని తేలడంతో సింపతీ డ్రామా ఆడుతున్నారని ఏ కంటి గాయమైందో కూడా మర్చిపోయిన వెల్లంపల్లి నాటకాలు ప్రజలకు అర్థం అయ్యాయన్నారు.

జగన్‌పై రాయి దాడి ఘటనలో తనను ఇరికించాలని చూశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహంతో వ్యవహరించారన్నారు. అమాయకులను బెదిరించి తన పేరు‌ చెప్పించాలని‌ చూశారని ఎన్నికల సంఘానికి ఈ అంశాలపై ఫిర్యాదు చేశామన్నారు. వారు విచారణ చేశాకే పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. మొత్తానికి విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు పడటంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News