BigTV English

Rajnathsingh comments: వైసీపీ పనైపోయింది, వారంతా ఇక జైలుకే

Rajnathsingh comments: వైసీపీ పనైపోయింది, వారంతా ఇక జైలుకే

Rajnath singh latest comments(Andhra politics news): ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ, మరో టీడీపీ, ఇంకోవైపు జనసేన, అటు బీజేపీలు జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.


దక్షిణాది రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉండేదని, వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని విమర్శించారు రాజ్‌నాథ్ సింగ్. భారీగా అప్పులు పెరిగాయని, జాతీయ తలసరి ఆదాయం లో ఏపీ వెనుకబడిందన్నారు. దీనికి ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. వైసీపీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని, ఐదేళ్లలో కేవలం మూడున్నర లక్షల ఇళ్లలను నిర్మించిందన్నారు.

ఇంటింటికీ కుళాయి నీరు అందించాలని 14వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయిస్తే.. కేవలం 1,900 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే భూమి, ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి రాగానే వారిని కచ్చితంగా జైలుకు పంపించి తీరుతామన్నారు.


అనకాపల్లిలో కూటమి అభ్యర్థుల తరపున రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్‌డీఏ అంటే నమ్మకమని, పదేళ్లలో ఎంతో చేసి చూపించామన్నారు. కేంద్రం నుంచి ఏపీకి ఎంతో సాయం చేస్తున్నామని, కానీ ఇక్కడి ప్రభుత్వం నిధులను పక్కదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

ALSO READ: వైసీపీలో వణుకు, ఏపీ నిఘా చీప్‌గా విశ్వజిత్, సీపీగా రామకృష్ణ

మరోవైపు మే నెల మొదటివారంలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట వంటి నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభలకు ఆయన హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×