E-Paper
Advertisement

గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

గ్రూప్ చాటింగ్ ఇకపై సూపర్ ఈజీ.. వాట్సప్ తెచ్చిన ఆ 4 కొత్త ఫీచర్ల గురించి తెలుసా?
Advertisement

WhatsApp New Features: చాలామందికి వాట్సప్‌లో అనేక గ్రూపులు ఉంటాయి. ఫ్యామిలీ, ఆఫీస్, అపార్ట్‌మెంట్ ఇలా ఎన్నో గ్రూపుల నుంచి రోజూ వందల మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో మనకు అవసరమైన సమాచారం ఏదో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు వాట్సప్ 4 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వీటితో ముఖ్యమైన మెసేజ్‌లను త్వరగా గుర్తించడంతో పాటు, గ్రూపుల్లో స్టేటస్‌లు పెట్టుకోవడం, అవసరమైన సమాచారాన్ని పిన్ చేసి ఉంచడం సులభం కానుంది.

మెసేజ్ ఫిల్టర్:

కొత్త అప్‌డేట్‌లో భాగంగా వాట్సప్ మెన్షన్లు, రిప్లైలకు సంబంధించిన ఫిల్టర్‌ను తీసుకొస్తోంది. గ్రూపులో ఎవరైనా మిమ్మల్ని ట్యాగ్ చేసినా.. మీ మెసేజ్‌కు రిప్లై ఇచ్చినా, @all అని మెసేజ్ పెట్టినా వాటిని సులభంగా గుర్తించవచ్చు. దీనివల్ల ప్రతి గ్రూపును విడిగా ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం తగ్గుతుంది. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ల మెసేజ్‌లను ముందుగా చూసుకోవచ్చు.

Advertisement

Also Read: పైసా ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా చేయొచ్చు.. అదెలాగంటే?

గ్రూప్ స్టేటస్:

వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది. దీని ద్వారా ఒక గ్రూపులోని సభ్యులకు మాత్రమే మీ స్టేటస్ కనిపించేలా పెట్టుకోవచ్చు. ఉదా: మీ ఫ్రెండ్స్ గ్రూపులో షేర్ చేయాలనుకున్న ఫొటోలు కుటుంబ సభ్యులకు కనిపించకుండా ఉంచవచ్చు. గ్రూపులోని సభ్యులు ఆ స్టేటస్‌ను చూడొచ్చు, స్పందించొచ్చు. సాధారణ స్టేటస్‌ల మాదిరిగానే ఇవి కూడా 24 గంటల తర్వాత మాయమవుతాయి.

శాశ్వత పిన్:

Advertisement

ఇప్పటివరకు వాట్సప్‌లో పిన్ చేసిన మెసేజ్‌లకు సమయ పరిమితి ఉండేది. కొత్త ఫీచర్‌తో ముఖ్యమైన మెసేజ్‌లను శాశ్వతంగా పిన్ చేసి ఉంచవచ్చు. అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ వివరాలు, ఈవెంట్ జరిగే ప్రదేశం, గ్రూప్ నియమాలు వంటి సమాచారాన్ని అందరికీ సులభంగా కనిపించేలా ఉంచొచ్చు.

ఇతర ఫీచర్లు:

వాట్సప్‌లో ఇప్పటికే ఉన్న కొన్ని ఫీచర్లు కూడా ఉపయోగపడతాయి. గ్రూపులోని ఒక వ్యక్తికి ప్రైవేట్‌గా రిప్లై ఇవ్వొచ్చు. పోల్స్‌లో ఒకే సమాధానాన్ని ఎంచుకునేలా మార్చుకోవచ్చు. అలాగే సభ్యులకు ట్రెజరర్ వంటి ట్యాగ్‌లు పెట్టుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. మీ ఫోన్‌లో కనిపించకపోతే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో వాట్సప్‌ను అప్‌డేట్ చేసి చూడండి. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: మనసు మార్చుకున్న యాపిల్.. టచ్‌స్క్రీన్‌తో MacBook Pro లాంచ్, ధర ఎంతంటే?

Tags

Related News

మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ ఈజ్ బ్యాక్.. కార్బన్ నుంచి రాబోతున్న ఆ రెండు ఫోన్లు ఇవే!

ప్రీమియం లుక్,పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్.. మోటోబుక్ 60 ధర ఎంతంటే?

ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు బిల్లు టెన్షన్ లేదా?జొమాటో సరికొత్త ట్రిక్!

మీ మొబైల్ నెట్‌వర్క్ స్లో అవ్వడానికి బ్యాటరీనే కారణమా?షాకింగ్ నిజాలు!

బట్టల క్లీనింగ్‌లో సరికొత్త విప్లవం..మార్కెట్‌ను శాసిస్తున్న స్టీమ్ వాషింగ్ మెషీన్లు

తక్కువ ధరలో..సినిమా థియేటర్ మజా,టాప్ 5 బడ్జెట్ స్మార్ట్ టీవీలివే!

యాపిల్, శాంసంగ్‌కు పోటీగా ఇండియన్ స్మార్ట్‌ ఫోన్ బ్రాండ్.. మార్కెట్లోకి ఎంట్రీ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×