BigTV English

Anil ravipudi – Venkatesh: ఈ కాంబోలో మరో 10 సినిమాలట..ఇంత ధైర్యం ఏంటి డైరెక్టర్ గారూ.?

Anil ravipudi – Venkatesh: ఈ కాంబోలో మరో 10 సినిమాలట..ఇంత ధైర్యం ఏంటి డైరెక్టర్ గారూ.?

Anil ravipudi – Venkatesh..సాధారణంగా తెరపై ఒక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బాగా పండి, సినిమా సూపర్ హిట్ అయింది అంటే.. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది హీరో, హీరోయిన్ల వరకే కాదు దర్శక నిర్మాతలు, దర్శక హీరోలకి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అంటే అదే కాంబో మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక కాంబో ఇప్పటివరకు మూడుసార్లు ప్రేక్షకులు ముందుకు వచ్చి, హిట్ అందుకొని ఇప్పుడు తమ కాంబోలో 7-8 చిత్రాలు.. కాదు ఏకంగా 10 చిత్రాలు కూడా వచ్చే అవకాశం ఉందని, ఆ డైరెక్టర్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హీరో ఎవరు? వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన చిత్రాలు ఏంటి? వాటి ఫలితాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో సినిమాలు..

F2..


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ (Venkatesh), అలాగే కామెడీని నమ్ముకొని ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సినిమాలు చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇదివరకే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘ఎఫ్2’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మరొక నటుడు మెగా హీరో, ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా నటించారు. ఇక అలాగే ఆలీ, తమన్నా, మెహ్రీన్, వై విజయ, ప్రగతి, అన్నపూర్ణమ్మ, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ ఇలా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చిన ఈ సినిమా 2019 జనవరి 12వ తేదీన సంక్రాంతి బరిలో నిలిచి, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు.

F3..

ఇక తర్వాత ఈ సినిమాకి కొనసాగింపుగా.. 2022 మే 27వ తేదీన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు .వెంకటేష్ ,వరుణ్ తేజ్ ,తమన్నా, మెహ్రీన్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా కామెడీ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం..

ఇక తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు, కామెడీ ఇష్టపడే ఆడియన్స్ కు ఈ సినిమా మంచి వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. క్రైమ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు.

మా కాంబోలో మరో 10 సినిమాలు..

ఇక అలా ఇప్పటివరకు ఈ కాంబోలో మూడు సినిమాలు వస్తే.. మూడు సినిమాలు కూడా కామెడీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “వెంకటేష్ గారు, నేను ఇద్దరం కలిసి భవిష్యత్తులో మరో ఏడెనిమిది చిత్రాలు చేయాలని అనుకుంటున్నాము. అది పది చిత్రాల వరకు వెళ్లిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.. మా ఇద్దరి కలయికను మేము కొనసాగించాలని కోరుకుంటున్నాము” అంటూ అనిల్ రావిపూడి తెలిపినట్లు సమాచారం. మొత్తానికైతే వీరిద్దరి కాంబోలో ఏకంగా 10 సినిమాలనేసరికి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది చూసి నెటిజన్స్ ఈ ధైర్యం ఏంటి డైరెక్టర్ గారూ?అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని కామెడీ పండిస్తూ సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమాలు హిట్ అవుతాయి అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×