BigTV English

Akkineni Akhil : అఖిల్ ఆ ఒక్కటి మార్చుకుంటేనే సినిమాలు హిట్ అవుతాయా..?

Akkineni Akhil : అఖిల్ ఆ ఒక్కటి మార్చుకుంటేనే సినిమాలు హిట్ అవుతాయా..?

Akkineni Akhil : సినీ ఇండస్ట్రీని ఏలుతున్న నాలుగు ఫ్యామిలీ లలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.. ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా కష్టపడి సినిమాలు చేస్తున్నాడు కానీ తన కష్టం బూడిదలో పోసిన పన్నీరు లాగా వృధా అయిపోతుంది. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కథ పరవాలేదు అనిపించినా కూడా యావరేజ్ టాక్ ను అందుకున్నాయి.. సరైన హిట్టు కోసం మనోడు చాలానే కష్టపడుతున్నాడు. గతంలో ఏజెంట్ అనే భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అఖిల్.. ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అతను భారీ బడ్జెట్ సినిమాలతో వస్తున్న కూడా అవి హిట్ టాక్ ని అందుకోకపోవడానికి ఒక కారణం ఉందని ఇండస్ట్రీలోని కొందరు అంటున్నారు.. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


అక్కినేని రెండో వారసుడుగా అఖిల్ సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమాతో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. హీరోగా అఖిల్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. కానీ ఆ సినిమా యావరేజ్ టాక్ ను అందుకోవడంతో అఖిల్ కు అంతగా పేరు రాలేదు.. మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి సినిమాలను చేశారు. ఇవేవీ సక్సెస్ కాలేదు. ఏజెంట్ తప్పక విజయం సాధిస్తుందని అనుకున్నారు. కాని ఏకంగా సినీ నిర్మాతే మా సినిమా ఫెయిల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఏ సినిమా చూసిన యావరేజ్ తాగిన అందుకోవడంతో అయ్యగారికి ఏమైంది అసలు అఖిల్ సినిమాలు ఎందుకు హిట్ అవ్వట్లేదు అనే చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

అక్కినేని అఖిల్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి బలమైన కారణం ఇదేనంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నాగేశ్వర్ రావు నుంచి నాగ చైతన్య వరకు ప్రతీ పేరులో ‘నాగ’ వచ్చింది. అంటే నాగమ్మ దయతో తమ కుటుంబం చల్లగా ఉంటుందని భావించి అందరికి అలా పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే అఖిల్ విషయానికొస్తే నాగ అనే పేరు అఖిల్ కి యాడ్ చెయ్యలేదు. అఖిల్ పేరులో నాగ అనే పేరు లేకపోవడంతోనే అఖిల్ పరిస్థితి ఇలా మారిందని చర్చలు జరుగుతున్నాయి.. తన అన్న నాగ చైతన్య పెద్ద స్టార్ కాకపోయినా కొన్ని సినిమాలు అయితే కలిసి వచ్చాయి. అఖిల్‌కి అది కూడా లేదని దాని వల్లనే ఏ సినిమా తీసిన హిట్ అవ్వట్లేదు అని టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తుంది. అఖిల్ ఇప్పటికైనా తన పేరులో నాగ అని పెట్టుకుని పేరు మార్చుకుంటే హిట్ సినిమాలు తన ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయని అక్కినేని అభిమానులు అంటున్నారు.. మరి అఖిల్ తన పేరు ముందు నాగ ని యాడ్ చేసుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. మార్చిలో అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు.


Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×