Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు.. సంధ్య థియేటర్ కేసులో ఆయనను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదిన సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే.. ఆ తొక్కిసలాటలో మృతురాలు కుమారుడు తో పాటుగా మరో ముగ్గురికి గాయాలు తగిలాయని తెలుస్తుంది. మహిళ తరపు బంధువులు ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.. కానీ ఆయన పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఆ సెక్షన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. అల్లు అర్జున్ మూవీని చూసేందుకు ఎంతో ఆశగా వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన పై హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల పై అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల పై సమగ్ర విచారణ జరిపినట్లు తెలుస్తుంది. ఇక న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్ట్ లో చేర్చారు. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కింద 5 నుంచి 10 ఏళ్ల శిక్ష..బీఎన్ఎస్ 118(1) రెడి విత్ 3/5 సెక్షన్ కింద ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు పడే అవకాశం ఉంది.. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా బన్నీకి జైలు శిక్ష తప్పేలా కనిపించలేదు.. ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బన్నీకి రిమాండ్ విధించునున్నారని సమాచారం..
ఇక మరోవైపు పుష్ప- 2 ప్రీమియర్ షో సమయంలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాన్యం తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రీ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉందని తెలిపారు. అయిన మేము పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చాము. అక్కడకు కొంతమంది పోలీసులు వచ్చినా తొక్కిసలాట జరిగింది చెబుతున్నారు. మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.