E-Paper
Advertisement

18 Pages Successmeet: ప‌క్క‌న అనుప‌మ ఉంటే అల్లు ఫాద‌రైనా, సుకుమార్ అయినా స్టెప్ వేయాల్సిందే!

18 Pages Successmeet: ప‌క్క‌న అనుప‌మ ఉంటే అల్లు ఫాద‌రైనా, సుకుమార్ అయినా స్టెప్ వేయాల్సిందే!
Advertisement

18 Pages Successmeet:ప‌క్క‌న అనుప‌మ ఉంటే అల్లు అర‌వింద్ అయినా సింపుల్‌గా నాలుగు స్టెప్పులు వేయాల్సిందే. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ అయినా లెక్క త‌ప్ప‌కుండా నాలుగు స్టెప్పులు వేసేయాల్సిందే. నూడుల్స్ జుట్టున్న మ‌ల్లుభామా? మ‌జాకా? ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే…. నిఖిల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన 18 పేజెస్ ఫ్రైడే విడుద‌లైంది. ఈ సినిమాలో నిఖిల్‌, అనుప‌మ ల‌వ్ స‌బ్జెక్ట్ కి ఫిదా అవుతున్నారు జ‌నాలు. ఈ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ని నిర్వ‌హించాయి గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో నిఖిల్, హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడు అల్లు అర‌వింద్‌, సుకుమార్ కూడా పాల్గొన్నారు. స‌క్సెస్ పార్టీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో క‌లిసి స్టెప్పులేశారు అల్లు అర‌వింద్‌. ఆయ‌న‌కు అనుప‌మ స్టెప్పులు నేర్పించే సీన్‌ని వీడియో తీసి పోస్ట్ చేశారు నిఖిల్‌.

అల్లు అర‌వింద్‌తో పాటు సుకుమార్‌కి కూడా స్టెప్పులు వేయ‌డం నేర్పించారు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. వీరంద‌రితో క‌లిసి త‌ర్వాత తాను కూడా స్టెప్పులేశారు నిఖిల్‌. స‌క్సెస్ పార్టీ అంటే ఆ మాత్రం జోష్ ఉండాల్సిందే అంటూ హ్యాపీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్. అనుప‌మ లాంటి కూతురు త‌న‌కు ఉంటే బావుండేద‌న‌ని చాలా సార్లు అనిపించింద‌ని ఆల్రెడీ చెప్పారు అల్లు అర‌వింద్‌. రంగ‌స్థ‌లం సినిమాలో రామ‌ల‌క్ష్మి కేర‌క్ట‌ర్‌కి ఫ‌స్ట్ ఆప్ష‌న్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ అనీ, కాక‌పోతే ఆమె ఆడిష‌న్స్ స‌మ‌యంలో అస్తమానూ వాళ్ల అమ్మ‌ను చూస్తుండ‌టంతో, కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ త‌క్కువ‌గా ఉన్నాయ‌నిపించి ఆమెను తీసుకోలేద‌ని సుకుమార్ చెప్పారు. ఇప్పుడు వారిద్ద‌రితో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×