BigTV English

Sankranthi 2026 : వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు.. ఫ్యాన్స్ కు పండగే..

Sankranthi 2026 : వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు.. ఫ్యాన్స్ కు పండగే..

Sankranthi 2026 : ప్రతి ఏడాది సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు కూడా స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ అయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఏ సినిమాలు ఉండబోతున్నాయ్ అంటూ మూవీ లవర్స్ ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకైతే జూన్, జూలై లో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2026 సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించే సినిమాలు ఈ పండగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి.. ఈ పండుగ సీజన్లో అభిమానులకు పెద్ద పండుగ కొత్త సినిమాలను రిలీజ్ అవుతున్నాయని తెలుస్తుంది. మరిక ఆలస్యం ఎందుకు వచ్చేయడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


అఖండ -2.. 

నందమూరి హీరో బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న సినిమా అఖండ 2.. సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. మొదట ఇదే ఏడాది దసరాకి ప్లాన్ చేసిన ఈ సినిమా, షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నా బాలయ్య సినిమాలు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో.. సినిమాని కూడా అప్పుడే రిలీజ్ చేస్తే భారీ హీట్ అవుతుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి..


చిరంజీవి – అనిల్ రావిపూడి..

చిరంజీవి, దర్శకుడు అనిల్ రవిపూడితో కలిసి ఓ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతి 2026లో సందడి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ మే 22 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.. ఈ మూవీలో హీరోయిన్ నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తుంది..అనిల్ రవిపూడి గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సంక్రాంతి సీజన్‌లో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు మెగాస్టార్ తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు అనిల్..

విజయ్ -వినోద్.. 

తమిళ స్టార్ హీరో విజయ్ చివరగా నటిస్తున్న సినిమా ‘జననాయకన్’తో సంక్రాంతి 2026 రేసులో చేరాడు. హెచ్. వినోద్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమా లాస్ట్ సినిమా కావడంతో విజయ అభిమానులు ఇప్పటినుంచే ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయన ఈ మూవీ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా రాజకీయాలకు పరిమితమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే..

వెంకటేష్ – త్రివిక్రమ్… 

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ ని అందుకున్నాడు విక్టరీ వెంకటేష్.. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ జులైలో ప్రారంభం కానుంది, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నాడు..

అయితే వచ్చేయడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటుగా చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మొత్తానికి చూసుకుంటే 2026 సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. మరి ఏ సినిమా సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×