Jagan – Ambati Rambabu: పార్టీని పటిష్టం చేసేందుకు జగన్ శ్రీకారం చుట్టారా? పార్టీ నుంచి వెళ్లిపోయే నేతల గురించి ఆరా తీస్తున్నారా? దాదాపు డజను వరకు నేతలు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? వారి వెళ్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? దాని గురించి అధినేత ఆరా తీస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీలో భారీగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయినవాళ్లు పార్టీని వదిలి వెళ్లి పోవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారట జగన్. ఆయా నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు అడుగులు వేస్తున్నారట. ఎందుకంటే సంక్రాంతి తర్వాత జిల్లాలకు ప్లాన్ చేస్తున్నారు జగన్. ఈ క్రమంలో వాటిని ఫుల్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది.
తొలుత 100 నియోజకవర్గాలపై జగన్ టార్గెట్ చేసిన్నట్లు వైసీపీ నుంచి ఓ ఫీలర్ వచ్చింది. బలమైన నేతలను ఆయా నియోజకవర్గాలకు పంపిస్తున్నారట. ఈ నేపథ్యంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నుంచి సత్తెనపల్లికి పంపించాలనే ఆలోచన చేస్తున్నారట. అది జరిగితే మాజీ మంత్రి అంబటి ఊహించని ఝలక్ తగలడం ఖాయమనే ప్రచారం లేకపోలేదు.
కేవలం అంబటి మాత్రమే కాదు. పలువురు సీనియర్ నేతల స్థానాల్లో మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. కాకినాడ రూరల్ నుంచి విశాఖ జిల్లా పెందుర్తికి షిప్ట్ అవ్వాలనే ఆలోచనలో మాజీ మంత్రి కన్నబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండడం దీనికి కారణంగా తెలుస్తోంది. అందుకే కన్నబాబు, తన నియోజకవర్గంపై ఫోకస్ చేయలేదని అంటున్నారు.
ALSO READ: నాగబాబు కాలం కలిసొచ్చింది.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్
వైసీపీకి బలంగా ఉండే 100 నియోజకవర్గాల జాబితాను జగన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండేళ్లలో ఏపీలో నియోజకవర్గాల పునర్ విభజన జరగనుంది. ఇప్పుడున్న 175 నుంచి 225 సీట్లకు పెరిగే ఛాన్స్ ఉంది.
అందుకోసమే జగన్ 100 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఖచ్చితంగా గెలవాలన్నది వైసీపీ ప్లాన్. రూరల్ నియోజకవర్గాల్లో అక్కడున్న బలాబలాలను బట్టి అభ్యర్థులను డిసైడ్ చేయాలన్నది ఆయన ప్లాన్‌గా చెబుతున్నారు. పట్టణాలు, సిటీల్లో అక్కడి పరిస్థితులను బట్టి ఆర్థికంగా బలమైన అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారట జగన్.
2019 ఎన్నికల స్ట్రాటజీని ఈసారి దూరంగా పెట్టాలని ఆలోచన చేస్తున్నారట జగన్. గతంలో ప్రజలతో మమేకమైన డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి సీట్లు ఇచ్చారు. వారంతా గెలుపొందారు. ఐదేళ్లు వైసీపీ ఎలాగూ అధికారంలో ఉంది. ఈసారి ఆ ఆలోచనకు భిన్నంగా వెళ్లాలనేది అధినేత ఆలోచన చెబుతున్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే జగన్ స్కెచ్‌ను వేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.
జమిలి ఎన్నికలకు పార్లమెంటులో బిల్లు పెట్టడంతో మరో రెండేళ్లలో ఎన్నికలు రావడం ఖాయమన్నది జగన్ అంచనా. ఈ నేపథ్యంలో ముందగానే నియోజకవర్గాలపై పూర్థిస్థాయిలో ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాలకు వెళ్లడం వెనుక అసలు కారణమిదేనని అంటున్నారు.