Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. హిట్ టాక్ని అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కోట్లు రాబడుతుంది.. వెంకటేష్ కు ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది. అయితే వెంకటేష్ సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. టాలీవుడ్ హీరోల అందరికంటే ఎక్కువ విక్టరీ వెంకటేష్ రీమేక్ సినిమాల్లో నటించారు.. అందరూ హీరో ల్లాగా ఈయన మాస్ ఇమేజ్ కోసం పరితపించలేదు. తన కెరీర్ ప్రారంభం నుంచి కథకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. అత్యధిక హిట్ పర్సంటేజ్ హీరో కూడా ఈయనే. వెంకీ ఇప్పటివరకు చాలా రీమేక్ సినిమాలు చేశారు. కానీ ఆ మూవీలు చూస్తే రీమేక్ లాగా కనిపించవు. ఇప్పటివరకు హీరో వెంకటేష్ నటించిన రీమేక్ సినిమాలు ఏంటి? అందులో టాప్ ఫైవ్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సూర్యవంశం..
ఫ్యామిలీ కథల చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అంటే విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి.. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన నటించిన చిత్రాల్లో సూర్యవంశం సినిమా ఒకటి. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టయిన సూర్యవంశం సినిమా ను తమిళ్ నుంచి రిమేక్ చేశారు. కానీ సినిమా చూసిన వారు రీమేక్ అంటే నమ్మరు..
జెమిని..
వెంకటేష్ నటించిన సినిమా జెమిని.. ఈ సినిమా అంతగా అనుకున్న హిట్ అయితే అందుకోలేదు గాని సినిమా మాత్రం బాగానే ఆడింది. ఈ సినిమా కూడా ఓ తమిళ సినిమా రీమేక్ గా వచ్చింది.. విక్రమ్ హీరోగా ఈ సినిమా వచ్చింది. అక్కడ యావరేజ్ గా నిలిచింది. కానీ తెలుగులో మాత్రం విక్రమ్ కంటే కాస్త అద్భుతంగా నటించారు వెంకీ..
ఘర్షణ..
వెంకటేష్ నటించిన సినిమా ఘర్షణ.. ఈ మూవీ తెలుగులో మంచి హిట్ ని అందుకుంది.. ఈ మూవీ కూడా తమిళ మూవీ రీమేక్ గానే వచ్చింది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కాకా మూవీ కి ఇది రీమేక్..
ఈనాడు..
బాలీవుడ్ లో ఎవెన్స్ డే అనే అనే పేరుతో వచ్చింది. ఇందులో కమల్ హాసన్ వంటి యూనివర్సల్ హీరో ఉన్నప్పటికీ వెంకీ అస్సలు తగ్గలేదు. ఆయన్ను డామినేట్ చేసే విధంగా నటించారు..
గోపాల గోపాల..
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ మై గాడ్ సినిమాకు ఇది రీమేక్. అక్కడి అక్షయ్ కుమార్ పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు. కానీ హిందీ సినిమాతో పోలిస్తే వెంకటేష్ ఈ సినిమాలో గోపాల్ పాత్రకు జీవం పోశారు అని చెప్పవచ్చు.. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది..
ఇదే కాదు వెంకటేష్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలను తన ఖాతాల వేసుకున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారో చూడాలి..