Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం పేరు కాదు. ఇది ఒక బ్రాండ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తన కెరియర్లో చేశారు. చాలామంది హీరోల సినిమాలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఉండేవి. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ కి పడిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పటివరకు మరో హీరోకి పడలేదు అంతే అతిశయోక్తి కాదు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో యాక్టివ్ గా లేరు. సినిమాలు చేస్తున్న కూడా అవి కేవలం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కేవలం తన పార్టీని నడపడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు అనేది వాస్తవం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ఉండే ఆసక్తి వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాలపై ఉండే ఆసక్తి వేరు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో బాగా ఇన్వాల్వ్ అయి ఎడిట్ రూమ్ లో కూడా కూర్చుండేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన సినిమా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు అని గ్యారెంటీ కూడా లేదు.
కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ తనను తాను నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో డిజాస్టర్ సినిమాలు పడినా కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గలేదు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం. తన కెరీర్ మొదటి నుంచే చాలామందికి సాయం చేయడం మొదలుపెట్టాడు. రాష్ట్ర ప్రజలకు సాయం చేసే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జనసేన అనే పార్టీని స్థాపించి దాదాపు 11 ఏళ్లపాటు పదవి లేకపోయినా కూడా ఎంతో ఓపికతో కృషి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలో యాక్టివ్ లేని సంగతి తెలిసిందే, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ ప్రస్తావిస్తూ… ఈ పదకొండు సంవత్సరాలు రాజకీయాల్లో లేకుండా సినిమాలు చేసి ఉంటే ఎన్ని ఆస్కార్ అవార్డులు తీసుకెళ్లే వారో ఎన్ని వేల కోట్లు సంపాదించే వారో అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు.
కొణతల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడు మరియు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే మరియు 1991 నుండి 1996 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల కన్వీనర్‌గా పనిచేసిన ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కొణతల రామకృష్ణ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : అందుకే పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారాడా.. ఈ స్పెషల్ ఏవీ చూస్తే గూస్‌బంప్సే!