Keerthi Suresh : కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో ఒకప్పుడు వినిపించేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వినిపిస్తుంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ సరిగ్గా ఆఫర్స్ లేకపోవడంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డెబ్యూ మూవీ బేబి జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ ధావన్ జోడిగా చేసిన బేబీ జాన్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. నిజానికి ఎంట్రీ ఇవ్వాల్సింది ఇలాంటి క్యారెక్టర్ తో కాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ తేరిలో సమంతా కూడా చనిపోయే పాత్రే చేసింది. కానీ అది విజయ్ ఇమేజ్, ఎలివేషన్ల మీద నడిచే కథ కావడంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది.. కానీ కీర్తి సురేష్ కు అక్కడ బ్యాడ్ లక్ వెంటాడింది. ఒక సినిమా చేసిన క్రేజ్ రాలేదు. కనీసం బాలీవుడ్ జనాలకు ఈమె పేరు కూడా సరిగ్గా తెలియదు. తాజాగా మీడియా ముందు కీర్తి సురేష్ కు ఘోర అవమానం జరిగింది.
కీర్తి సురేష్ బేబి జాన్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. కీర్తి సురేష్ రెండు పాటల్లో డాన్స్ చేసి చనిపోయే క్యారెక్టర్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవ్వడం కష్టం. అసలే బేబీ జాన్ ఊర మాస్ మసాలా సినిమా. అట్లీ అడిగాడు కదాని చేసింది కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేదు పాప… పైగా ఇదేదో పెద్ద బ్రేక్ అవుతుందని భావించి పెళ్లి జరిగిన వెంటనే గ్యాప్ లేకుండా ప్రమోషన్లలో పాల్గొన్నది. అంత కష్ట పడిన ఆమె కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. తప్ప పెద్దగా నటనకు గుర్తింపు దక్కలేదనే టాక్ వినిపించింది.. బేబీ జాన్ లో మరో హీరోయిన్ వామికా గబ్బి పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా లేకపోయినా నిడివి, ప్రాధాన్యత పరంగా కొంచెం బెటర్ అనిపించుకుంది తప్ప బెస్ట్ అయితే కాదు..
తెలుగు నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు సక్సెస్ సినిమాలతో మంచి ట్రాక్ రికార్డును మెయింటైన్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. షాలిని పాండే, త్రిష, కాజల్ అగర్వాల్, శ్రియ శరన్, తమన్నా భాటియా లాంటి వాళ్ళు ఏదో ఒకటి రెండు హిట్లు తప్ప బ్లాక్ బాస్టర్ కొట్టిన దాఖలాలు లేవు. డెబ్యూనే నార్త్ లో మొదలుపెట్టిన పూజా హెగ్డేకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ అక్కడ లేదు.. ఇక ఇప్పుడు క్రేజ్ కోసం అక్కడకు వెళ్లిన కీర్తి సురేష్ పరిస్థితి కూడా అదే అని చెప్పాలి. ఇక కీర్తికి బాలీవుడ్ లో ఘోరమైన పరిస్థితి ఎదురైంది. ఈ మూవీ గురించి తాజాగా ఇటీవల ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించినట్లు తెలుస్తుంది. అక్కడ కీర్తి ని కృతి అని సంభోదించారు.. నిన్న కెమెరా మెన్లు ఫోటోలు తీస్తు కృతి ఇటు చూడు అని అడిగారు. దానికి కృతి కాదు కీర్తి అన్నారు. ఆ తర్వాత కూడా కీర్తి దోశ అని అరిచారు. దానికి కీర్తి దోశ కాదు.. కీర్తి సురేష్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.. ఆది కాస్త వీడియోలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. క్రేజ్ కోసం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ కనీసం పేరు కూడా తెలియకపోవడంతో తెలుగు వాళ్ళు అయ్యే పాపం అని అంటున్నారు.. ఇక ప్రస్తుతం చేతిలో సినిమాలు అయితే లేవు..