BigTV English

RRR : స్కాట్‌ దొర ఇకలేరు.. RRR టీమ్ భావోద్వేగం..

RRR : స్కాట్‌ దొర ఇకలేరు.. RRR టీమ్ భావోద్వేగం..

RRR : రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మూవీ RRR ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఈ చిత్రంలో విలన్ గా బ్రిటన్ నటుడు రే స్టీవెన్సన్‌ అద్భుతంగా నటించారు. ప్రేక్షకులను ఎంతోగానే మెప్పించారు. RRRలో ఆయన బ్రిటిష్‌ గవర్నర్‌ స్కాట్‌ బక్స్‌టన్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు. కరడుగట్టిన ‘స్కాట్‌ దొర’ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. 58 ఏళ్ల రే స్టీవెన్సన్ ఇకలేరు. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ఆదివారమే మరణించినట్లు తెలుస్తోంది. అయితే మృతికి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.


రే స్టీవెన్సన్‌ పూర్తి పేరు జార్జ్‌ రేమండ్‌ స్టీవెన్సన్‌. సినిమాలతోపాటు టెలివిజన్‌ సిరీస్‌ల్లోనూ ఆయన నటించారు. 1964 మే 25న నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో స్టీవెన్సన్‌ జన్మించారు. ఆయన తండ్రి రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ గా పనిచేశారు. తన 29వ ఏట బ్రిస్టల్‌ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో రే స్టీవెన్సన్ యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశారు.

స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా స్టీవెన్సన్‌ యాక్టింగ్‌ కెరీర్‌ మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1998లో ది థియరీ ఫ్లైట్‌ చిత్రంతో ఆయన సిల్వర్‌ స్క్రీన్‌ పై తొలిసారి కనిపించారు. 2004లో వచ్చిన కింగ్‌ ఆర్థర్‌లో డాగోనెట్‌ రోల్‌లో ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది. హెచ్‌బీవో రోమ్‌ టీవీ సిరీస్‌లో టైటస్‌ పులోగా ఆకట్టుకున్నారు. థోర్‌, స్టార్‌వార్స్‌ లాంటి హిట్‌ చిత్రాలు ఆయనకు మంచి పేరుతెచ్చాయి.


స్టీవెన్‌సన్‌ బ్రిటిష్‌ నటి రుత్‌ గెమ్మెల్‌ను వివాహమాడారు. బాండ్‌ ఆఫ్‌ గోల్డ్‌ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 1997లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. అదే ఏడాది పీక్‌ ప్రాక్టీస్‌ అనే చిత్రంలోనూ కలిసి నటించారు. కానీ 8 ఏళ్లకే వారి మధ్య బంధం తెగిపోయింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలున్నారు.

స్టీవెన్సన్‌ మృతిపై RRR చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘సర్‌ స్కాట్‌.. మీరెప్పుడూ మా గుండెల్లో నిలిచి ఉంటార’ అంటూ ట్వీట్‌ చేసింది.

Tags

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×