Thriller Movie OTT : ఇటీవల థియేటర్లలో వచ్చే సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంటే కొద్ది రోజులు రన్ అవుతాయి. లేకుంటే ఎలా వచ్చాయో తెలియకుండా మాయం అవుతాయి. ఇక ఓటీటీల్లోకి కొత్త సినిమాలు నెలలోపే విడుదల అవుతుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయితే మాత్రం కొన్నిసార్లు రెండు నెలలు కూడా పడతాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కథలతో వచ్చే సినిమాలు ఓటీటీలో రిలీజ్ మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా మరో తెలుగు థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. భయం మనిషిని ఎంత భయపెట్టిస్తుందో ఈ మూవీలో చూపించారు. మరి ఆ మూవీ ఏంటి? ఓటీటి లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి…
మూవీ & ఓటీటి..
కొలీవుడ్ డైరెక్టర్, నిర్మాత, డ్యాన్సర్, హీరో రాఘవ లారెన్స్ నటించిన హారర్ సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వేదిక ఈ మధ్య ఎక్కువగా హారర్ సినిమాల్లోనే నటిస్తుంది. సినిమాలతో పాటుగా ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.. తాజాగా వేదిక నటించిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. గతంలో ఓటీటి డీటెయిల్స్ ను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు డేట్ అనౌన్స్ చెయ్యకుండా సడెన్ గా ఓటీటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఫియర్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రంలో వేదిక ప్రధాన పాత్రలో నటించగా.. అరవింద్ కృష్ణ, పవిత్రా లోకేష్, జయప్రకాష్, అనీల్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు. హరిత గోగినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే పలు ఫిలిం ఫెస్టివల్స్‌లో ఫియర్ మూవీ అవార్డులను అందుకున్నది..
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీని డిసెంబర్ సెకండ్ వీక్ లో థియేటర్లలో రిలీజ్ చేశారు. థ్రిల్లర్ అంశాలకు హారర్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేశారు చిత్ర డైరెక్టర్ . టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తుచేసేలా ఓ చిన్న మెసేజ్‌ను ఈ సినిమాలో టచ్ చేశారు. కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కంటెంట్ తో పాటుగా అటు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతోనే హరిత గోగినేని డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు ఈ సినిమాకు ఎడిటర్‌గా కూడా హరిత పనిచేశారు..
ఈ మూవీలో హీరోయిన్ తన క్లాస్మేట్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. వీరిద్దరూ పెళ్లి అయినా కొద్ది రోజులు బాగానే ఉంటారు ఆ తర్వాత ఆమె భర్త కనిపించకుండా పోతాడు. ఆమె భర్త కోసం వెతుకుతున్న ఆమెను ఎవరో ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడని ఆమెను చంపాలని అనుకుంటున్నారని భ్రమపడుతుంది. అదే ఆలోచనలో ఉంటుంది ఆ భయమే ఆమెను క్రమంగా భయపెడుతుంది.. ఆమె ప్రవర్తన మితిమీరడంతో ఆమెను మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు కుటుంబసభ్యులు. అక్కడ ఆ అమ్మాయికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? సింధు రూపంలోనే ఉన్న ఇందు ఎవరు? సంపత్ ఏమయ్యాడు? భర్తపై ఆమెకున్న ప్రేమ ఎలాంటి పరిస్థితుల్లోకి ఆమెను పడేస్తుంది అన్నది స్టోరీ. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ మూవీ ఓటీటిలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..