Zombie Reddy 2: ఇండస్ట్రీలోకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తమకంటూ ఫేమ్ సంపాదించుకున్న హీరోలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వారితో పాటు చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రయాణం మొదలుపెట్టి హీరోలుగా మారిన వారిని కూడా ఆడియన్స్ ఆదరిస్తారు. ఆ లిస్ట్‌లోకి తేజ సజ్జా ఎప్పుడో యాడ్ అయిపోయాడు. ‘ఓ బేబి’తో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తేజ సజ్జా.. బ్యాక్ టు బ్యాక్ యూత్‌ను ఇంప్రెస్ చేసే సినిమాలు చేశాడు. ఇక ‘హనుమాన్’ తర్వాత ఆ క్రేజ్ ఏ లెవెల్‌కు పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా తనకు లైఫ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తేజ. దానికి సపోర్ట్‌గా ఒక స్టార్ నిర్మాత రంగంలోకి దిగాడు.
ముందుకొచ్చిన నిర్మాత
ప్రశాంత్ వర్మ (Prasanth Varma), తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్‌లో ముందుగా తెరకెక్కిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఆ మూవీతోనే తేజకు హీరోగా మంచి పాపులారిటీ లభించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసూళ్లను సాధించింది. 2021లో ‘జాంబీ రెడ్డి’ మాత్రమే కాదు.. మరో రెండు సినిమాల్లో కూడా నటించాడు తేజ సజ్జా. అయితే ‘జాంబీ రెడ్డి’ విడుదలయినప్పుడే దీనికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ సీక్వెల్ గురించి ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ‘జాంబీ రెడ్డి 2’ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మను నమ్మి ఒక స్టార్ నిర్మాత ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడని సమాచారం.
ఇద్దరూ బిజీ
ప్రస్తుతం స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా అందరితో సినిమాలు తెరకెక్కిస్తూ నిర్మాతగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు నాగవంశీ (Naga Vamsi). అలాంటి నిర్మాతలకు చేతిలోకి ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’ వెళ్లిందని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పూర్తిగా తన సినిమాటిక్ యూనివర్స్‌పైనే దృష్టిపెట్టాడు. తేజ సజ్జా కూడా ‘మిరాయ్’ లాంటి భారీ బడ్జెట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ‘జాంబీ రెడ్డి 2’ వర్కవుట్ అవుతుందా అనే అనుమానం అందరిలో మొదలయినా కూడా నాగవంశీ లాంటి నిర్మాత తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని కూడా ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: అందుకే ఇల్లు అమ్మేసుకున్నా.. పాపం కంగనాకు ఎంత కష్టమొచ్చింది..!
రెమ్యునరేషన్ ఓకే
మొదట్లో ‘జాంబీ రెడ్డి 2’ (Zombie Reddy 2) అనేది ఒక పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ చేతికి వెళ్లిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీనిని నాగవంశీ టేక్ ఓవర్ చేశారని తెలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ తేజ సజ్జాకు కూడా క్రేజ్ పెరిగింది కాబట్టి తనకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి నాగవంశీ రెడీగా ఉన్నారట. ఎప్పుడైతే ‘జాంబి రెడ్డి 2’ ప్రాజెక్ట్ ఫిక్స్ అవుతుందో అప్పుడే మేకర్స్ నుండి ఒక అధికారిక అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల అవుతుందని సమాచారం.