BigTV English

Subham: డైరెక్టర్ కన్నా రైటర్ గొప్పవాడు అని తెలిపిన నూతన దర్శకుడు

Subham: డైరెక్టర్ కన్నా రైటర్ గొప్పవాడు అని తెలిపిన నూతన దర్శకుడు

Subham: టాలీవుడ్ అందాల తార సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాకు శుభం. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం కామెడీ హర్రర్ మూవీ గా మన ముందుకు రానుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నోవాటెల్ హోటల్లో నిర్వహించారు. ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా నిర్మాత సినీ నటి అయిన సమంత విచ్చేశారు. మూవీ టీం, అభిమానుల సమక్షంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులా మాట్లాడుతూ రైటర్స్ గురించి కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..


డైరెక్టర్ కన్నా రైటర్ గొప్పవాడు..

దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులా మాట్లాడుతూ.. ‘నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. నా కుటుంబం నాకెంతో అండగా ఉంది. నేను ఈ పొజిషన్ కి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నేను ఈ ప్రపంచంలోకి రావడానికి నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ఈ వేదిక తరపున థాంక్స్ చెప్తున్నాను. ఈ శుభం సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మీరు సినిమా చూసినప్పుడల్లా చాలా కొత్త ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇలాంటి మూవీకి బ్రాండ్ సమంత. ఇలాంటి సినిమా ముందుకు రావాలంటే ఆవిడ లాంటి వారు ఎంకరేజ్మెంట్ ఇవ్వబట్టే ఇక్కడదాకా వచ్చాము. ఈ సినిమా కంటెంట్ నేను చాలా నమ్ముతున్నాను. ఈ కాలంలో ఇలాంటి చిన్న సినిమాలకి ఒక పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు సపోర్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టం. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ సినిమా తీసినందుకు. నేను ఈ స్టేజిలో ఇక్కడ ఉండడానికి కారణం స్క్రిప్ట్ డైరెక్టర్ రాజు, వసంత్ గారు. నేను డైరెక్టర్ గా మీ అందరి కనిపిస్తాను గాని, సినిమాకి రైటర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సినిమా కు డైరెక్టర్  కన్నా రైటర్ గొప్ప అని,మా సినిమా కూడా వసంత్ చాలా బాగా పనిచేశారు. సినిమాలో పని చేసిన యాక్టర్స్ అందరూ ముఖ్యంగా హర్షిత్, శ్రేయ చాలా బాగా నటించారు. ఇది వారి ఫస్ట్ సినిమా అంటే మీరు నమ్మరు. వీళ్ళందరూ మనకి ఇక దొరకనంత ఎత్తుకు ఎదిగిపోతారు. ఈ సినిమా మార్నింగ్ షో చూసిన తర్వాత అందరూ చెప్తారు నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది అని’ ఆయన తెలిపారు.


సమంత తొలి ప్రయత్నం ..

హీరోయిన్ సమంత నిర్మాతగా మొదటిసారి శుభం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమాకు ప్రమోషన్స్ లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. ఈమె స్థాపించిన ట్రాలాలా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రీయ, చరణ్, శాలిని, శ్రావణి, వంటి నటులు కీలకపాత్రలో నటించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్, ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఇక మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ జన్మజన్మల బంధం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ లో సమంత స్టెప్పులు వేసి అలరించింది వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×