BigTV English

Man Cheats Film Producer: ‘ఒక్క ఛాన్స్’ అన్నాడు.. మత్తులో ముంచి నిర్మాతను నిండా ముంచేశాడు..

Man Cheats Film Producer: ‘ఒక్క ఛాన్స్’ అన్నాడు.. మత్తులో ముంచి నిర్మాతను నిండా ముంచేశాడు..

Man Cheats Tollywood Film Producer: ఒక్క ఛాన్స్ .. ఒకే ఒక్క ఛాన్స్ .. ఈ డైలాగ్ వింటే ముందుగా గుర్తొచ్చేది ఖడ్గం సినిమా. ఆ సినిమాలో రవితేజ అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరగడం గుర్తుందా. సరిగ్గా రియాలిటీలో కూడా ఒక వ్యక్తి సినిమాల్లో నటించడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ నిర్మాత వద్దకు వచ్చాడు. రెండుమూడుసార్లు ఛాన్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగడంతో.. మే 1న ఆడిషన్స్ కు రావాలని సూచించాడు. తనలోని నటననంతా చూపించాడు. ఆ తర్వాత తనలోని చోరకళను ప్రదర్శించాడు. నిర్మాత నుంచి బంగారం, డబ్బు దోచుకుని ఉడాయించాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరి ఎల్లలుబాబు.. భావేశ్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థు రన్ చేస్తున్నాడు. అతను కృష్ణానగర్ లో నివాసం ఉంటున్నాడు. గతేడాది సాయికుమార్ తో నాతోనేను అనే సినిమాను కూడా తీశారు. ఇప్పుడు మరో కొత్త సినిమా కోసం యాక్టర్లకోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ అనే యువకుడు ఇటీవల ఎల్లలుబాబు వద్దకు వెళ్లి సినిమా ఛాన్స్ కావాలని కోరాడు. రెండు మూడుసార్లు ఆఫీస్ చుట్టూ తిరగడంతో.. మే 1న ఆడిషన్స్ కు రావాలని చెప్పాడు.

Also Read: సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాలని ఉందా.. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపరాఫర్..


ఆడిషన్స్ లో మనోడు తనలోని టాలెంట్ ను అంతా చూపించాడు. ఛాన్స్ ఇస్తే మంచి నటుడిని అవుతానని మాటల్లోకి దించాడు. ఇంతలో మధ్యాహ్నం కావడంతో.. పక్కనే ఉన్న రెస్టారెంట్ లో లంచ్ తేవాలని చెప్పాడు నిర్మాత. శ్రీకాంత్ భోజనంతో పాటు.. మద్యం కూడా తీసుకొచ్చాడు. అభిమానంతో తెచ్చానని మాటల్లో పెట్టి.. ఫుల్లుగా తాగించాడు.

పూర్తిగా మద్యం మత్తులో నిద్రపోయిన ఎల్లలుబాబు మెడలోని 10 తులాల గోల్డ్ చైన్, 3 ఉంగరాలు, రాడో వాచీ, రూ.50 వేల నగదు తీసుకుని ఉడాయించాడు. శ్రీకాంత్ కు మెలకువ వచ్చేసరికి ఒంటిపై ఏవీ కనిపించలేదు. వెంటనే కొడుకుకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. టంగుటూరి బాబు జరిగిన దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు శ్రీకాంత్ పై ఐపీసీ 420, 380సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్ జాడ కోసం గాలిస్తున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×