Big Stories

Rajamouli : జక్కన్నకు ప్రపంచ కీర్తి.. ఆర్ఆర్ఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డు..

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి తీసిన ప్రతి సినిమా హిట్టే. సినిమా సినిమాకు జగ్గన్న స్థాయి పెరిగింది. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమోగింది. ఇలా హాలీవుడ్ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ హౌరా అనిపిస్తున్నారు. జగ్గన్న చెక్కిన తాజా శిల్పం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వసూళ్లులో రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రాజమౌళి అందుకున్నారు. ఎంతో కీర్తిని సంపాదించారు.

- Advertisement -

ఇప్పుడు ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డును దర్శకధీరుడు రాజమౌళి అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో RRR చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఈ వేడుకలకు రాజమౌళి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ధోతీ-కుర్తా ధరించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

అవార్డు అందుకున్న తర్వాత రాజమౌళి ఏం చెప్పారంటే..
“RRR చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం సంతోషంగా ఉంది. నా దృష్టిలో సినిమా ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా ప్రతి సీన్ థియేటర్‌లో ఎలా ఉంటుందో ప్రేక్షకుడిగా ఊహించుకుంటా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు రూపొందిస్తున్నాను. RRRపై భారతీయులు ఎంత ప్రేమ చూపించారో.. అదే అభిమానాన్ని విదేశీయుల్లోనూ చూశాను. న్యూయార్క్‌, చికాగో థియేటర్లలో వాళ్ల అనుభూతిని ప్రత్యక్షంగా చూశా. చిత్రబృందం నా కుటుంబం లాంటిది అంటూ ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. కానీ నా విషయంలో అది కాస్త భిన్నం. ఎందుకంటే నా సినిమాల కోసం పనిచేసే వ్యక్తులందరూ నా సొంత కుటుంబసభ్యులే. నా తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథ రాస్తుంటారు. పెద్ద అన్నయ్య కీరవాణి సంగీత దర్శకుడు, నా సతీమణి రమా కాస్ట్యూమ్‌ డిజైనర్‌, నా తనయుడు కార్తికేయ, వదిన వల్లి లైన్‌ ప్రొడ్యూసర్లు, సోదరుడి కుమారుడు కాలభైరవ సింగర్, మరో సోదరుడు రైటర్.. వాళ్ల నన్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడం కోసం కష్టపడుతున్నారు. నేను నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. RRR టీమ్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు’’ అని రాజమౌళి వివరించారు.

తెలుగు చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలోనే కాదు ప్రపంచస్థాయిలో ఆదరణ లభిస్తుందని జక్కన్న నిరూపించారు. మగధీర, బహుబలి, RRR సినిమాలతో టాలీవుడ్ రేంజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లారు. అందుకే రాజమౌళి అంటే ఓ ఇంటర్నేషల్ బ్రాండ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News