BigTV English

Star Hero : ఒక పూట తినడానికి తిండి లేని స్థితి.. కట్ చేస్తే.. పాన్ ఇండియా హీరో..?

Star Hero : ఒక పూట తినడానికి తిండి లేని స్థితి.. కట్ చేస్తే.. పాన్ ఇండియా హీరో..?

Star Hero : ఎప్పుడు ఎవరి లైఫ్ టర్న్ అవుతుందో ఎప్పుడు ఎవరు ఇండస్ట్రీకి దూరమవుతారో చెప్పడం చాలా కష్టం. అవకాశాలు బోలెడున్న కూడా అదృష్టం ఆవగించేంత కూడా లేకుండా ఉంటే సినిమాలు ఎన్ని చేసినా హిట్అవ్వవు.. ఈ మధ్య కొందరు స్టార్ హీరోల పరిస్థితి కూడా అలానే ఉంది. భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కూడా ఆ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ స్టాక్ ను అందుకోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒకప్పుడు ఏమీ లేకుండా టాలెంటు నమ్ముకుని ఇండస్ట్రీ లోకి వచ్చిందా కొన్ని స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలను చేస్తున్నారు.. తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ రేంజ్ లో ఉన్న హీరోలలో ధనుష్ కూడా ఒకరు. ఈయన సినిమా కెరియర్ ఎలాంటి మలుపులు తిరిగిందో గతంలో చాలా సార్లు వినే ఉంటాం. ప్రస్తుతం ఆయన రేంజ్ స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళింది .. ధనుష్ సినీ ప్రయాణం మొదలవ్వక ముందు ఆయన జీవితంలో కూడా కష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


తమిళ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తెలుగులో ఈయన సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈయనకు ఇక్కడ అభిమానులు కూడా ఉన్నారు.. తనదైన నటనతో అందరినీ మెప్పించి ఆకట్టుకుంటారు ఆయన.. అలాంటి హీరో ఒకానొక సమయంలో కనీసం ఒక పూట అన్నం తినడానికి కూడా దిక్కు లేని పరిస్థితి అనుభవించారట.. సినిమాల్లోకి రాకముందు ధనుష్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. ధనుష్ ఫ్యామిలీ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం..

ధనుష్ కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ధనుష్ కి ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య సెల్వరాఘవన్ ఉన్నారు.. అన్నయ్య కూడా తమిళ ఇండస్ట్రీలో దర్శకుడే.. ఆయన తెలుగులో కూడా కలిసి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,7/G బృందావన కాలనీ, సినిమాలకు దర్శకుడిగా చేశారు.. ఇక తను నాన్న కూడా ఒక స్టార్ డైరెక్టర్.. ధనుష్ పుట్టేటప్పటికీ వాళ్ళ కుటుంబం కటిక పేదరికంలో ఉందట.. చిన్న గదిలో ఉండే వారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు ఒక్క పూట కూడా తినలేని పరిస్థితి ఉండేది. కస్తూరి రాజా ఒక్క రూపాయి బస్ చార్జి మిగిలడం కోసం పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లే వారట. ధనుష్ కు మూడు నాలుగేళ్లు వచ్చేంతవరకు అలాంటి పరిస్థితి కొనసాగింది. తర్వాత వాళ్ళ నాన్న కథలు రాస్తూ కుటుంబాన్ని పోషించారు. ధనుష్ టెన్త్ క్లాస్ వరకు బాగా చదివి తర్వాత ఇంటర్మీడియట్ లో ఒక అమ్మాయి తో లవ్ లో పడి తన చదువుకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఇంటర్ కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. ధనుష్ వాళ్ళ నాన్న మెల్లగా అతని చేత సినిమా వైపు అడుగులు వేసెలా చేశారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడం మాత్రమే కాదు.. కోట్లు వసూలు చేస్తున్నారు . ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×