Marco OTT: మలయాళం సినిమాలు అంటే ఫీల్ గుడ్ అనే జోనర్ నుండి ప్రేక్షకులను బయటకు తీసుకొచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో తాజాగా విడుదలయిన ‘మార్కో’ కూడా ఇకటి. ఉన్న ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి మూవీ టీమ్ పెద్దగా ప్రమోషన్స్ ఏమీ చేయలేదు. కానీ కేవలం మౌత్ టాక్‌తోనే కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ లభించాయి. ఇప్పుడు ఈ మూవీ ఫైనల్‌గా ఓటీటీలోకి వచ్చే సమయం వచ్చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్‌ను స్వయంగా ఉన్ని ముకుందన్ (Unni Mukundan) తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ ఓటీటీలోనే
2024 డిసెంబర్‌లో ‘మార్కో’ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. విడుదయిన కొన్నిరోజులకే మంచి మౌత్ టాక్ సంపాదించుకుంది. దీంతో ఈ సినిమా గురించి చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. కేవలం మలయాళంలోనే విడుదలయినా కూడా ఈ మూవీని చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో దీనికి థియేటర్లు కూడా పెరిగాయి. అలా మలయాళంలో తెరకెక్కిన మోస్ట్ వైలెంట్ మూవీగా ‘మార్కో’ ఓ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. కానీ ఈ మూవీని థియేటర్లలో చూడాలనుకొని చూడలేని వారికోసం ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకుంది.
అన్ని భాషల్లో
‘మార్కో’ (Marco) ఓటీటీ హక్కులను సోనీ లివ్ (Sony LIV) దక్కించుకోగా ఈ మూవీ కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. ‘మలయాళం సినిమాలోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మీ ముందుకు రానుంది. మార్కో కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ సోనీ లివ్ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ ప్రకటనతో ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటికే థియేటర్లలో చూసిన ప్రేక్షకులు సైతం మళ్లీ ఈ మూవీని ఓటీటీలో చూడడానికి సిద్ధమవుతున్నారు. హీరో ఉన్ని ముకుందన్ సైతం ‘మార్కో’ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సంతోషంగా పోస్ట్ షేర్ చేశాడు.
Also Read: లవ్ రివెంజ్ డ్రామా తో పిచ్చెక్కించే యాక్షన్ థ్రిల్లర్… ఏ ఓటీటిలో ఉందంటే
గన్స్ కోసమే
‘ఈ ఫిబ్రవరి 14 గులాబీ పువ్వుల కోసం మాత్రమే కాదు.. గన్స్ కోసం కూడా’ అంటూ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ‘మార్కో’ మూవీ ఓటీటీలోకి వస్తుంది అనే విషయాన్ని ప్రకటించాడు ఉన్ని ముకుందన్. డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా.. రోజురోజుకీ మంచి టాక్‌తో కలెక్షన్స్‌ను పెంచుకుంటూ దూసుకుపోయింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ‘మార్కో’లో సిద్ధికీ, జగదీష్, అన్సాన్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఏ సర్టిఫికెట్ అందుకున్న ఈ మూవీ ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. యాక్షన్ లవర్స్‌కు ‘మార్కో’ విపరీతంగా నచ్చేసింది. చాలామంది తెలుగు మేకర్స్ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
#Marco will be streaming from Feb 14 on SOnY LIV. pic.twitter.com/hqpbz1d3Ma
— Christopher Kanagaraj (@Chrissuccess) January 31, 2025