BigTV English

Ajith Kumar : రేసింగ్ కారుకు ఘోర ప్రమాదం… ఆ యాక్సిడెంట్‌లో హీరో అజిత్‌కు ఏమైందంటే..?

Ajith Kumar : రేసింగ్ కారుకు ఘోర ప్రమాదం… ఆ యాక్సిడెంట్‌లో హీరో అజిత్‌కు ఏమైందంటే..?

Ajith Kumar : ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith)కి తృటిలో అతిపెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా.. రైడింగ్ కారు కాస్త అదుపు తప్పి ట్రాక్ పక్కన ఉన్న గోడను ఢీ కొట్టింది. భయాందోళనలకు గురైన సిబ్బంది వెంటనే ఆయన కారు వద్దకు వెళ్లి చూడగా.. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదట. దీంతో సిబ్బంది కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అజిత్ రేసింగ్ కోసం దుబాయిలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా, అజిత్ కు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అజిత్ ఒకవైపు సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే.. మరొకవైపు తన అభిరుచిని కూడా చాటుకుంటూ దూసుకు వెళ్తున్నారు. ఇప్పటికే రేసింగ్ లో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించిన ఈయన.. ఇప్పుడు సరికొత్తగా మళ్లీ తనను తాను మలుచుకుంటూ రేసింగ్ లో ఇంటర్నేషనల్ లెవెల్ లో సక్సెస్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు.


అజిత్ కుమార్ కెరియర్..

కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన ఇప్పటివరకు 61 చిత్రాలలో నటించారు. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అజిత్.. 4 విజయ్ అవార్డులు, 3 సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులతో పాటు 3 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ అలాగే మూడు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఇక తన నటనా వృత్తితో పాటు రేసింగ్ లో తన అభిరుచిని చాటుకుంటూ ఉంటాడు. ఎంఆర్ఎఫ్ రేసింగ్ సిరీస్ 2010లో పాల్గొన్న ఈయన ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రదేశాలలో ఇండియా చుట్టూ ఉన్న సర్క్యూట్ లలో పోటీపడ్డారు. అంతేకాదు అంతర్జాతీయ మైదానంలో ఫార్ములా ఛాంపియన్షిప్ రేసులో కూడా పాల్గొన్న ఈయన అతి కొద్ది మంది భారతీయులలో ఒకడిగా నిలిచారు. భారతీయ ప్రముఖుల వార్షిక ఆదాయాల ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఏకంగా మూడుసార్లు స్థానం దక్కించుకున్నారు.


అజిత్ ప్రారంభ జీవితం..

అజిత్ 1971 మే 1న తంజావూరులో జన్మించారు. పాలక్కాడ్ , కేరళలో వీరి మూలాలు ఉన్నాయి. ఈయన తండ్రి పేరు పి సుబ్రహ్మణ్యం.. 2023లో మరణించారు. ఈయన తల్లి మోహిని.. సింధీ, కోల్కతా ప్రాంతానికి చెందినవారు. అజిత్ పదవ తరగతి చదువుతున్న సమయంలోనే హాసన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి నిష్క్రమించి, సెకండరీ విద్యను పూర్తి చేయడానికి ముందు ఎన్ఫీల్డ్ కంపెనీలో పనిచేసిన కుటుంబ స్నేహితుడి ద్వారా అప్రెంటిస్ గా ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత మెకానిక్ గా మారడానికి ఆరు నెలల శిక్షణ తీసుకున్నాడు. వైట్ కలర్ ఉద్యోగం కావాలని కోరుకున్న ఈయన తండ్రి ఒత్తిడితో, ఆ పనిని కూడా వదిలిపెట్టాడు. అలాగే మరొక కుటుంబ స్నేహితుడి సహాయంతో దుస్తులను ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలో కూడా అప్రెంటిస్ గా చేరారు.ఆ తర్వాత డెవలపర్గా ఎదిగి సేల్స్ అసైన్మెంట్ లపై క్రమం తప్పకుండా దేశవ్యాప్తంగా పర్యటించి ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం మెరుగుపరుచుకున్నాడు. ఇక తర్వాత 1993లో ‘ ప్రేమ పుస్తకం’ అనే తెలుగు సినిమాలో తొలిసారి నటించి అదే ఆయన నటించిన తొలి ఏకైక చిత్రంగా కూడా మిగిలిపోయింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×