BigTV English

‘AA 22’ Announced : ప్ర‌భాస్ కథ‌తో అల్లు అర్జున్‌.. రూట్ మార్చిన గురూజీ!

‘AA 22’ Announced : ప్ర‌భాస్ కథ‌తో అల్లు అర్జున్‌.. రూట్ మార్చిన గురూజీ!
AA 22' Announced


‘AA 22’ Announced : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. AA 22గా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌తో పాటు గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఈ మూవీ నిర్మాణం జ‌రుగుతుంది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న 4వ సినిమా ఇది. కాగా.. ఈ సినిమాపై ఆసక్తిక‌ర‌మైన క‌థనాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అదేంటంటే.. ఈ సినిమా ఫిక్ష‌న‌ల్ మూవీగా రాబోతుంద‌ట‌.

సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ త‌న సినిమాలోని పాత్ర‌ల‌ను మ‌న పురాణాల‌కు అనుగుణంగా మ‌లుచుకుని ట్రెండ్‌కు త‌గిన‌ట్లు మార్చి రాసుకుంటుంటారు. అదే స్టైల్లో AA 22 సినిమా క‌థ‌ను కూడా మ‌హాభార‌తంలోని రెండు ప‌ర్వాల‌ను ఆధారంగా చేసుకుని డిజైన్ చేసుకున్నార‌నే టాక్ ఓవైపు బ‌లంగా వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మ‌రో వార్త కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అదేంటంటే.. త్రివిక్ర‌మ్ ఈ క‌థ‌ను ప్ర‌భాస్ కోసం త‌యారు చేసుకున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం డార్లింగ్ వ‌రుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రివిక్ర‌మ్‌తో సిమా చేయాలంటే మ‌రో ఏడాది దాటేస్తుంది. ఈ విష‌యం మాట‌ల మాంత్రికుడికి బాగా తెలుసు. అందుక‌నే త‌ను అల్లు అర్జున్‌తోనే సినిమా చేయ‌టానికి రెడీ అయ్యారు.


ఇక అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూడు సినిమాలు వ‌చ్చాయి. అవే స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, జులాయి, అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలు. ఈ మూడు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగో సినిమా రానుంది. అయితే ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో త్రివిక్ర‌మ్ గుంటూరు కారం సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు బ‌న్నీ సైతం సుకుమార్‌తో పుష్ప 2 సినిమాను చేస్తున్నారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాల‌ను కంప్లీట్ చేసుకున్న త‌ర్వాతే AA 22 పైకి తీసుకెళ‌తారు. దాదాపు ఈ ఏడాది చివ‌ర‌లోనే మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×