#AA22: అల్లు అర్జున్ (Allu Arjun).. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకోవడమే కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన హీరోగా రికార్డ్ సృష్టించారు. ఈ సినిమాలో అత్యుత్తమ నటన కనబరిచి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ రేంజ్ లో సక్సెస్ లభించడంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానులు అప్పుడే ఆసక్తి కనబరుస్తూ ఉండగా.. నిన్న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 22వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు.
#AA 22 మూవీ బడ్జెట్..
ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియో అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా అవతార్ వంటి చిత్రాలకు పని చేసిన అతి పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీ ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ వారు ఈ సినిమాను దాదాపు రూ.800 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో రూ.250 కోట్లు ఒక్క వీఎఫ్ఎక్స్ కోసమే కేటాయిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ రేంజ్ లో ఏ చిత్రానికి కూడా ఇంత బడ్జెట్ కేటాయించలేదు. ముఖ్యంగా బాహుబలి, కే జి ఎఫ్, కల్కి లాంటి చిత్రాలకు కూడా రూ.700 కోట్ల లోపే బడ్జెట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ సినిమా కోసం రూ.8వందల కోట్లు అనేసరికి అంచనాలు రెట్టింపు అయిపోయాయి. మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ తో అట్లీ, అల్లు అర్జున్ రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
అల్లు అర్జున్ రెమ్యునరేషన్..
ఇదిలా ఉండగా హై ఎక్స్పెక్టేషన్ తో ఇంటర్నేషనల్ లెవెల్ లో రాబోతోంది ఈ సినిమా. మరి ఇలాంటి సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్ల వరకూ పారితోషకం తీసుకోబోతున్నారట. దీంతో పాటు లాభాలలో 20% వాటా కూడా కోరినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయిన కారణంగానే అల్లు అర్జున్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ కి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని సన్ పిక్చర్స్ బ్యానర్ అధినేత కళానిధి మారన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో, డైరెక్టర్, నిర్మాత సెట్ అయ్యారు కానీ హీరోయిన్ ఎవరు..? మిగతా నటీనటులు ఎవరు..? ఎవరిని ఈ సినిమాలో ఏ పాత్ర కోసం తీసుకోబోతున్నారు? అనే విషయాలు ఇంకా ఏవీ రివీల్ చేయలేదు. త్వరలోనే ఒక్కొక్కరిని ఫిక్స్ చేసుకొని పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.