Siddu Jonnalagadda: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు, వైష్ణవి జంటగా నటిస్తున్న సినిమా జాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా చిన్నదైనా ప్రేక్షకులకు నచ్చితే బ్రహ్మరథం పడతారు అన్నది నిజం. రీసెంట్ గా వచ్చిన ‘మాడ్ స్క్వేర్’ ఇందుకు నిదర్శనం. చిన్న సినిమాలుగా వచ్చిన టిల్లు, టిల్లు స్క్వేర్, బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాల తరువాత సిద్దు నుంచి వస్తున్న సినిమా జాక్. ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రోగ్రాం కి యాంకర్ గా సుమ వ్యవహరించారు. ఈవెంట్ లో సిద్దు యాంకర్ సుమ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు చూద్దాం..
Also read: Ram Charan Peddi : ‘పెద్ది’ హిందీ టీజర్ చూశారా? ఆ వాయిస్ ఎవరిదో గమనించారా?
సుమ కి కౌంటర్ వేసిన సిద్దు ..
యాంకరింగ్ చేయడంలో సుమ కి సరిసాటి ఎవరు లేరు. సినిమా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమనే కనిపిస్తుంది. హీరోలు కూడా సుమని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. సినిమా మొదటి ఇంటర్వ్యూ నుంచి ప్రమోషన్స్ వరకు సుమకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని అనుకునే వారు ఉన్నారు. సుమ చేసే అల్లరికి, ఆమె మాటలకి అందరూ ఫిదా అవుతారు. సిద్ధూ జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు సినిమాలో ‘నా చెయ్యి ఇంకా నీ చేతిలోనే ఉంది’ అనే డైలాగ్ సిద్దు ఎలా చెప్తాడు అని హీరోకి మైక్ ఇవ్వబోతూ అడుగుతుంది. అప్పుడే నిర్మాత ప్రసాద్ ఆ డైలాగులు పూర్తి చేస్తారు. మైక్ అందుకున్న సిద్దు మాట్లాడుతూ.. భాస్కర్ గారు ఎప్పుడు నా చెయ్యి పట్టుకోలేదు, ఈ సినిమాకి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. ఆ డైలాగ్ నేను చెప్పడం కన్నా ఆ సిద్దు చెప్తేనే బాగుంటుంది అని అన్నాడు. సుమకి అర్థం కాక ఏ సిద్దు అని అడుగుతుంది. బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ అని సుమకి క్లారిటీ ఇస్తూ, ఏంటి సుమా గారు మీరు ఇంత స్లో అయ్యారు అని నవ్వుతూ సుమ కి కౌంటర్ వేస్తాడు.
హీరో ఇలా కూడ బోల్తా కొట్టిస్తారా ..
నేను ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ చాలానే ఇచ్చాను. కానీ సుమ గారితో ఒక ప్రోగ్రాం చేయలేదని ఫీలింగ్ నాకుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ తో అది తీరిపోయింది. నేను నిజంగా చెప్తున్నాను సుమ గారితో మొదటి ఇంటర్వ్యూ చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది అన్నది నా నమ్మకం, సెంటిమెంట్. టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు సినిమాలకు మొదటి ఇంటర్వ్యూ మీతోనే(సుమ) చేసి సక్సెస్ అందుకున్నా.. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అని సిద్దు తనదైన శైలిలో మాట్లాడి సుమని ఆట పట్టించాడు. ఒక్క క్షణంలో సుమకి కౌంటర్ వేసి వెంటనే బోల్తా కొట్టించడం సిద్దు కే సాధ్యమైంది. అక్కడే ఉన్న ఆడియన్స్ అంతా ఒక్కసారిగా కేకలు, అరుపులతో సందడి చేశారు. ఈ సినిమా ఈనెల 10వ తేదీన థియేటర్లలో రానుంది. సినిమాను థియేటర్ లో చూసి ఆదరించాలని హీరో కోరారు.