BigTV English

Samantha: అల్లు అర్జున్ – అట్లీ మూవీలో సమంత… అట్లీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చిన సామ్

Samantha: అల్లు అర్జున్ – అట్లీ మూవీలో సమంత… అట్లీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చిన సామ్

Samantha: టాలీవుడ్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఒకటే హాట్ టాపిక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కలిసి ఒక భారీ పాన్-ఇండియన్ సినిమా చేయబోతున్నారనే వార్తలతో పాటు, ఆ సినిమాలో సమంత ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. “సన్ ఆఫ్ సత్యమూర్తి”లో వీరిద్దరి హిట్ కాంబినేషన్, ఆ తర్వాత “పుష్ప: ది రైజ్”లో “ఊ అంటావా మావా” సాంగ్‌లో వారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ వార్తలకు మరింత క్రేజ్ వచ్చింది. అభిమానులు మళ్లీ ఈ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూశారు.


క్లారిటీ ఇచ్చిన సామ్…

అయితే, ఈ ఊహాగానాలకు స్వయంగా సమంత తెరదించారు. తన సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందిస్తూ, “అట్లీ నాకెంతో క్లోజ్ ఫ్రెండ్! కానీ #AA22xA6 ప్రాజెక్ట్‌లో నేను నటిస్తున్నాననే వార్తలో ఎలాంటి నిజం లేదు” అని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పేశారు. దీంతో, అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో సమంత నటిస్తుందంటూ చక్కర్లు కొట్టిన వార్తలకు ఒక స్పష్టమైన ఎండ్ కార్డ్ పడినట్టయింది. సమంత తన సన్నిహితుడైన అట్లీతో భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌లో మాత్రం ఆమె భాగం కావడం లేదని తేలిపోయింది. దీంతో, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.


ఈ సినిమాలో హీరోయిన్..వారి పేర్లు తెరపైకి ..

ప్రస్తుత సమాచారం ప్రకారం, దర్శకుడు అట్లీ ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం బాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ నటీమణులు జాన్వీ కపూర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ దిశా పటాని, అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమాలో ఒక క్రేజీ బాలీవుడ్ స్టార్ ప్రతినాయకుడి పాత్రను పోషించే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఒక ఆసక్తికరమైన పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాకుండా, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

సమంత ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేదని తెలియడంతో ఆమె అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, అల్లు అర్జున్ – అట్లీ వంటి ఇద్దరు పవర్ హౌస్ టాలెంట్స్ కలిసి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడటానికి మాత్రం వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక ప్రకటనలు వస్తాయని ఆశిస్తున్నారు అభిమానులు. అప్పటివరకు, ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఎవరు భాగం కానున్నారో తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే..

Jayasudha: పాత్రలు నచ్చకపోయినా యాక్ట్ చేశా… పాత రోజులు గుర్తుతెచ్చుకున్న జయసుధ

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×