BANK OF BARODA Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ పాసై ఉంటే చాలు.. ఇది సువర్ణవకాం అనే చెప్పవచ్చును. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
భారతదేశంలో ముఖ్యమైన ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA) దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 500
బ్యాంక్ ఆఫ్ బరోడా (BANK OF BARODA) లో ఆఫీస్ అసిస్టెంట్ (ఫ్యూన్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీల పరంగా..
ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) : 500 ఉద్యోగాలు (ఏపీలో 22 ఉద్యోగాలు, తెలంగాణలో 13 ఉద్యోగాలు ఉన్నాయి.)
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్ తో పాటు స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధలనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.19,500 ఫీజు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 23
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bankofbaroda.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారిని వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం కూడా ఉంటుంది. నెలకు రూ.19,500 ఫీజు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: BIS Recruitment: డిగ్రీ, బీటెక్ అర్హతతో బీఐఎస్‌లో జాబ్స్, జీతం రూ.75వేలు.. 3 రోజులే ఛాన్స్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 23
Also Read: BPNL Recruitment: టెన్త్, ఇంటర్ అర్హతతో 12,891 ఉద్యోగాలు.. జీతం రూ.75,000