సాధారణంగా వంటింట్లో ఉండే కూరగాయల్లో ఉల్లిగడ్డలు కామన్. ఏ కూర వండినా ఉల్లిగడ్డలను కోసి వేస్తుంటారు. ఉల్లిగడ్డల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బోలెడు ఆరోగ్య సమస్యలను అరికడుతాయి. గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలక వ్యాధులను తగ్గించడంలోనూ ఉల్లిగడ్డలు సాయపడుతాయి. ఇవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఉబ్బసం లాంటి వ్యాధులను తగ్గించే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ ను నయం చేసే లక్షణాలు
ఉల్లిగడ్డలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ క్వెర్సెటిన్ పదార్థం ఎక్కు మొత్తంలో ఉంటుంది. ఉల్లిగడ్డలను రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాప్తిని నివారించిచే అవకాశం ఉంటుంది. జీర్ణాశయ క్యాన్సర్ ను నివారించే యాంటీ ఆక్సిడెంట్ బాగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన ఫ్రీరాడికల్స్ ను సైతం సమర్థవంతంగా తొలగిస్తుంది. సెల్యులార్ జీవక్రియలోని రసాయన ఉత్పత్తులు ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మారుస్తాయి. వాటిని నాశనం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉంటుంది. అయినప్పటికీ ఉల్లిగడ్డలు పూర్తిగా క్యానర్ ను నివారించవు. అదే సమయంలో క్యాన్సర్ చికిత్సలో ఉల్లిగడ్డలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే, వీలున్నంత వరకు ఉల్లిగడ్డలను కూరల్లో విరివిగా ఉపయోగించాలనేది నిపుణుల సూచన.
నల్లగీతలు ఉన్న ఉల్లిగడ్డలు చాలా డేంజర్
ఉల్లిగడ్డలు తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభం అయినప్పటికీ, కొన్ని ఉల్లిగడ్డలు క్యాన్సర్ రావడానికి కారణం అవుతాయి. సాధారణంగా ఉల్లి గడ్డలు కోయడానికి ముందు దాని మీద ఉన్న ఎండిన పొరలను తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉల్లి పై పొరను తొలగించగానే, కింద నల్లని గీతలు కనిపిస్తాయి. సాధారణంగా వాటిని కడిగి కట్ చేసి, వంట చేస్తూ ఉంటారు. కానీ, అలాంటి ఉల్లి గడ్డలను అస్సలు తినకూడదంటున్నారు నిపుణులు. వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు. ఉల్లిగడ్డలపై ఉన్న నల్ల గీతలు ఫంగస్ కారణంగా ఏర్పడుతాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: గోరింటాకు, డికాషన్ కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. జీవితంలో తెల్లజుట్టు రాదు
ఇతర కూరగాయలతో కలిపి ఉంచినా ప్రమాదమే!
ఈ నల్ల గీతలు ఉన్న ఉల్లిగడ్డలను ఇతర కూరగాయలతో కలిపి ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటికి కూడా ఫంగస్ సోకే అవకాశం ఉంటుందట. సో, ఇకపై అలాంటి ఉల్లిగడ్డలు తినకపోవడం మంచిది. ఉల్లి గడ్డలు కొనేటప్పుడు కూడా నల్లని మచ్చలు లేని ఉల్లిగడ్డలు తీసుకోవడం మంచిది. మీరు చేసే పొరపాటు లేదంటే నిర్లక్ష్యం కారణంగా, క్యాన్సర్ నుంచి కాపాడాల్సిన ఉల్లిగడ్డలే, క్యాన్సర్ కు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. మున్ముందు ఈ ముప్పు ఉన్న ఉల్లిగడ్డలకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Read Also: మెగా ఫ్యామిలీ అంతా కంచు కంచాల్లోనే తింటారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
Read Also: సిమెంట్ వాడకుండానే ఇల్లు కట్టేశారు.. ఎలాగో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!