Aadhi Pinisetty: సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ప్రైవసీ లేకుండా పోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పెళ్ళికానివారు వేరే ఎవరితో కనిపించినా వారిద్దరికీ పెళ్లిళ్లు చేసేస్తున్నారు. పెళ్లయిన వారు కలిసి కనిపించకపోతే వారిద్దరూ విడాకులు తీసుకున్నారని రూమర్స్ సృష్టిస్తున్నారు. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది ట్రోలర్స్ కు భయపడే కుటుంబంలోని ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తున్నారు అనేది ఒక టాక్.
ఇక ఎప్పటినుంచో హీరో ఆది పిన్ని శెట్టి తన భార్యకు విడాకులు ఇస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలపై హీరో ఆది పినిశెట్టి స్పందించడం జరిగింది. దర్శకుడు రవి రాజా పిన్ని శెట్టి నట వారసుడిగా ఆది పినిశెట్టి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఒక విచిత్రం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆది వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ నటుడిగా సంపూర్ణంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుగు వాడే అయినా కూడా ఎక్కువగా తమిళ్ సినిమాలు చేయడంతో ఆది అటు తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే అయ్యాడు.
తెలుగులో ఆయన నటించిన రంగస్థలం, నిన్ను కోరి, సరైనోడు ఇలాంటి సినిమాలు ఆది నటనకు అద్దం పట్టాయి. ఇక తాజాగా ఆది హీరోగా నటిస్తున్న చిత్రం శబ్దం. అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కి రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆది వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టాడు.
Prabhas: ఇదెక్కడి విడ్డూరం.. ప్రభాస్ పేరుతో ఒక ఊరు కూడా ఉందా.. ? ఎక్కడో తెలుసా.. ?
ఆది హీరోయిన్ నిక్కీ గల్రానీని 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండు మూడు సినిమాలో నటించారు. ఆ సమయములోనే వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ అవ్వడంతో ఈ జంట విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి .ఇదే విషయాన్ని యాంకర్ ఆదికి గుర్తు చేయగా ఆది దాని గురించి మాట్లాడుతూ ” నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉండి చాలా క్యారెక్టర్స్ చేసి సెన్సిటివ్ గా ఉండకూడదు అనుకున్నాను. ఇంకా ఎక్కువగా ధైర్యంగా ఉండాలని నేర్చుకున్నాను.
రిజెక్షన్స్ అనేవి డైలీ జరుగుతూనే ఉంటాయి. మనం 250 మంది మధ్యలో పనిచేస్తూ ఉంటాం.. అందరూ మర్యాద ఇవ్వాలని లేదు కొంతమంది నిన్ను కేర్ చేస్తారు. కొంతమంది నీ ముందే నీ ముఖంపైనే మాట్లాడుతారు.. ఇంకొంతమంది నీ వెనుక మాట్లాడుతారు ఇవన్నీ చూస్తూ వచ్చాక ఇంకా మనలో ధైర్యం ఎక్కువ పెరుగుతుంది. విడాకుల గురించి ఒక థంబ్ నెయిల్ చూసినప్పుడు నేను షాక్ అయ్యాను అసలు ఆ వీడియో పెట్టిన వాళ్ల గురించి ఆ వీడియో కన్నా ముందు ఎలాంటి వీడియోలు చేశాడు అనేది చూశాను. అది చూశాక అతని గురించి గానీ, ఆ విషయం గురించి గానీ పట్టించుకోవాలని నేను అనుకోలేదు.
ఒకవేళ ఉంది అనుకుంటే రాసిన కూడా ఓకే.. కానీ ఏమీ లేకుండా ఏదో ఒక రెండు ఫోటోలు పెట్టి చెప్పేస్తే అది నిజమైపోదు. ఇలాంటి వాళ్లు గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లు వాళ్ళ లైఫ్ ని అలా బతికేస్తున్నారు అని అనుకోవడమే. అయితే ఇవి కాకుండా క్రిటిక్స్, నెగిటివ్ క్రిటిక్స్, పాజిటివ్ క్రిటిక్స్ అవి నేను తీసుకుంటాను. అందులో కొద్దిగా ఏదైనా నేర్చుకోవచ్చా అని ఆలోచిస్తూ ఉంటాను .ఇలాంటి విషయాల్లో ఎంత వదిలేస్తే అంత మంచిది. కానీ, నా విడాకులు ఆ విషయం విన్నప్పుడు నేను కొద్దిగా బాధపడ్డాను. కొన్ని నిమిషాల తర్వాత దాన్ని దాటి వచ్చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలుగా మారాయి. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని ఆది చెప్పడంతో నెటిజన్స్ సైతం మీరు ఎప్పుడు అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.