BigTV English

 Aadikeshava Movie Review : ఆదికేశవ రివ్యూ.. బోయపాటి ఝలక్ వర్కవుట్ అయిందా ?

 Aadikeshava Movie Review : ఆదికేశవ రివ్యూ.. బోయపాటి ఝలక్ వర్కవుట్ అయిందా ?
Aadikeshava Movie Review

Aadikeshava Movie Review(Tollywood news in telugu):

ఉప్పెన సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ తేజ.. రంగ రంగ వైభవంగా ,కొండపొలం అంటూ ప్రేక్షకులను ఓ రేంజ్ లో మెప్పించాడు. ఆ రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తేలేకపోయాయి .కానీ ఆ మూవీస్ వల్ల తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరోగా వైష్ణవ తేజ కి సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . ఇక వైష్ణవ తేజ రీసెంట్ ప్రాజెక్ట్ ఆదికేశవాలు అతనితో పాటు శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వాయిదాలు పడుతూ వచ్చి ఎట్టకేలకు విడుదలైంది..పంజా వైష్ణవ్ తేజ్ , శ్రీలీల కాంబోలో వచ్చిన ఈ మూవీకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు వహించారు.సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు నవంబర్ 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఇది ఏ రేంజ్ లో మెప్పించిందో తెలుసుకుందాం.


సినిమా : ఆదికేశవ 

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ 


డైరెక్టర్: శ్రీకాంత్ ఎన్. రెడ్డి

సంగీతం: జీవీ ప్రకాష్

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

విడుదల తేదీ: నవంబర్ 24, 2023  

కథ :

హైదరాబాదులో జాబ్ ట్రయల్స్ లో బిజీగా ఉన్న ఓ కుర్రాడు బాలకోటయ్య ( వైష్ణవ్ తేజ్)..అలియాస్ బాలు. ఈ క్రమంలో అతనికి చిత్రావతి ( శ్రీ లీల) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. చిత్రావతి ఒక కాస్మోటిక్ కంపెనీకి సీఈఓ .ఇంటర్వ్యూ చేసే క్రమంలో బాలు వ్యక్తిత్వం చిత్రకు నచ్చడంతో క్రమంగా వాళ్ళిద్దరూ స్నేహితులై.. ఆ తర్వాత ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర తల్లిదండ్రులు బాలు లాంటి వాడికి తమ కూతురు ఇవ్వడం ఏంటన్న ఆలోచనతో.. చిత్ర కు ఒక బిజినెస్ మ్యాన్ సంబంధం చూసి సెట్ చేస్తారు. ఇదే విషయాన్ని ఆమె బర్త్ డే పార్టీలో అందరి ముందు అనౌన్స్ చేస్తాడు ఆమె తండ్రి. 

అక్కడితో ఆగకుండా తమ కూతురుకి దూరంగా ఉండమని బాలుకి వార్నింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సరిగ్గా అదే సమయానికి రాయలసీమ నుంచి బాలు కోసం ఎమ్మెల్యే మహాకాళేశ్వర్ రెడ్డి, అతని అన్నయ్య పార్టీలోకి ఎంటర్ అవుతారు. ఊహించని ఈ ట్విస్ట్ తో అక్కడ ఉన్న అందరూ అయోమయంలో పడిపోతారు.

మరోవైపు బ్రహ్మసముద్రంలో కొన్ని దారుణాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో బాలు తండ్రి చనిపోతాడు. అసలు తండ్రి ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరుగుతోంది తెలుసుకోవడానికి బ్రహ్మసముద్రం చేరుకున్న బాలు అక్కడ జరిగే దారుణాలను ఎలా ఎదిరిస్తాడు? తను అనుకున్నది సాధించాడా లేదా? చిత్ర తో బాలు పెళ్లి జరిగిందా లేదా? బాలు కోసం సీమ మనుషులు వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? మహాకాళేశ్వర్ రెడ్డికి బాలుకి మధ్య ఏం జరిగింది? అనేది తెలియాలంటే స్క్రీన్ పై స్టోరీ చూడాల్సిందే.

విశ్లేషణ :

మొత్తానికి సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికీ టేకింగ్ కాస్త వెరైటీగా ఉంటుంది. మొదటి 45 నిమిషాలు మూవీ లో హైలెట్ గా ఉన్నాయి. ఫస్ట్ అఫ్ రొటీన్ గానే ఉంది కానీ కామెడీ ..కాస్త లవ్ కలపడంతో కొంచెం ఇంట్రెస్టింగ్ గా గడిచిపోతుంది. అసలు సినిమా అనేది సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ లో పైలా పచ్చీసుగా అమ్మాయి వెనుకబడి తిరిగి ఒక కుర్రవాడు ఊరి సమస్య తనది అని ఎలా పోరాడుతాడు అద్భుతంగా చూపించారు.

బాలకోటయ్య, ఆదికేశవ.. ఈ రెండు పాత్రలకు వైష్ణవ తేజ ప్రాణం పోశాడు. తన యాక్షన్ తో అదరగొట్టేసాడు. సుమన్, రాధిక, తనికెళ్ల భరణి ఈ మూవీలో ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ లీల తన పరిధి మేరకు అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ మూవీలో సింహాద్రి లోని ఎన్టీఆర్.. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుగ్గి అనే పాటకి శ్రీ లీల మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

ఇంటర్వెల్ ముందు వరకు స్టోరీ కాస్త లవ్ యాంగిల్ తో రొమాంటిక్ గా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా సీమకు షిఫ్ట్ అయిపోతుంది .ఇక అక్కడి నుంచి యాక్షన్స్ సన్నివేశాలలో మనకు బోయపాటి కనిపిస్తాడు. హీరో ఎలివేషన్.. క్లైమాక్స్ అన్ని ఊర మాస్ గా చూపించాలి అనుకోవడంతో.. మూవీలో మాస్ కంటెంట్ బాగా ఎక్కువైంది అనిపిస్తుంది. దీంతో అక్కడక్కడ బోర్ కొడుతుంది.లాస్ట్ లో ఒక చిన్న సీన్ కామెడీ కోసం అనుకుని పెట్టారు.. కానీ అది అప్పటివరకు హీరో చూపించిన ఎమోషన్స్ మొత్తం మీనింగ్ లెస్ గా మార్చిందా అనిపిస్తుంది. మొత్తానికి మూవీ కాస్త ఎంటర్టైనింగ్ గానే ఉంది.

 చివరిగా.. ఆదికేశవ.. బోయపాటి స్టైల్ ఇష్టపడేవాళ్లకి మంచి మాస్ యాక్షన్ ట్రీట్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×