E-Paper
Advertisement

Naga Chaitanya Sobhita : శోభితతో తనకున్న రిలేషన్‌పై నాగచైతన్య ఓపెన్

Naga Chaitanya Sobhita : శోభితతో తనకున్న రిలేషన్‌పై నాగచైతన్య ఓపెన్
Advertisement

Naga Chaitanya Sobhita : సమంతతో విడాకుల తరువాత… నాగచైతన్య సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం సైలెంట్‌గా లేడనేది ఓ టాక్. విడాకుల విషయంపై ఇప్పటి వరకు నోరెత్తలేదు నాగచైతన్య. పైగా సమంత ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, తన కెరీర్ మరింత ముందుకు సాగాలని మాత్రమే చెప్పాడు. అయితే, ఇప్పటివరకు సమంతపై నాగచైతన్య నెగటివ్ కామెంట్స్ చేయకపోవడానికి కారణం శోభిత ధూళిపాళ్ల అని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమో గానీ… ఈమధ్య నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంటపై తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న గాసిప్. పైగా అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో.. ఈసారి నాగచైతన్యకి శోభిత ధూళిపాళ్ల సెట్ అవుతుందని కూడా అనుకున్నారు. ఒక్కసారి నాగచైతన్య కనిపిస్తే.. ఈ డేటింగ్ రూమర్స్ గురించి అడిగేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే అడిగేశారు.

Advertisement

కస్టడీ సినిమా కోసం ప్రచారం చేస్తున్నాడు నాగచైతన్య. ఇందులో భాగంగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు కూడా ఉంటాయిగా. అబ్బాయి సరిగ్గా దొరికాడని శోభిత ధూళిపాళ్ల గురించి మీ అభిప్రాయం ఏంటని అడిగేశారు. ఫస్ట్ టైం.. శోభిత ధూళిపాళ్ల గురించి నాగచైతన్య మాట్లాడారు. అదేంటంటే… తమ మధ్య రిలేషన్ అనేది ఓ గాసిప్ అని. నిజంగా గాసిప్ అయితే… నాగచైతన్య, శోభిత కలిసి ఉన్న ఫొటో బయటకు ఎలా వస్తుందని చెబుతున్నారు. ఓ రెస్టారెంట్‌లో చెఫ్‌తో కలిసి సెల్ఫీ దిగారు చైతూ. అందులో వెనక శోభిత కూడా ఉంది. అలా ఫొటోలో కనిపించడానికి అదేం షూటింగ్ కాదు, వీళ్లిద్దరూ కలిసి సినిమా కూడా చేయలేదు. కాని, ఫొటో బయటికొచ్చింది.

అయితే.. అనవసరంగా శోభిత ధూళిపాళ్ల పేరు ఎందుకు లాగుతారంటూ కొంత అసహనంతోనే మాట్లాడాడు చైతూ. ఇలాంటి వ్యవహారాల్లోకి శోభిత ధూళిపాళ్ల పేరు తీసుకురావడం కరెక్ట్ కాదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అటు శోభిత కూడా క్లారిటీ ఇచ్చింది. తానేం తప్పు చేయడం లేదంటోంది. అంతే గానీ… డేటింగ్‌లో ఉన్నాం, ఓ రిలేషన్ నడుస్తోందని మాత్రం చెప్పలేదు. తమ రిలేషన్‌పై ఇప్పటికిప్పుడు మీడియా ముందుకు వచ్చి.. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేసింది. కాని, ఇద్దరి వర్షన్స్ ఒకసారి గమనిస్తే… డేటింగ్ చేయడం లేదనే విషయాన్ని మాత్రం డైరెక్టుగా చెప్పలేదంటున్నారు. అవసరంగా ఇష్యూ చేయొద్దు అన్నట్టుగానే ఓ క్లారిటీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×