Dil Raju : దిల్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు వెంకటరమణారెడ్డి. దిల్ సినిమా హిట్ అవడంతో వెంకటరమణ రెడ్డి కాస్త దిల్ రాజుగా మారిపోయారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి రాజుగా కొంత కాలాన్ని కూడా ఆయన గడిపారు. ప్రస్తుతం దిల్ రాజు సినిమాలు తీయడంలో కొంచెం వెనక తగ్గారు. కానీ ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటేనే మినిమం గ్యారెంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఎంతోమంది కొత్త దర్శకులను ఆవిష్కరించిన ఘనత దిల్ రాజుకి ఉంది. చాలామంది టాప్ డైరెక్టర్స్ ఇదే సంస్థ నుంచి వచ్చారు. కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు తీయడం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఇప్పుడు సినిమాలను నిర్మించే స్థాయికి ఎదిగారు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయినా కూడా కాంప్రమైజ్ కాకుండా దిల్ రాజు పెద్ద సినిమాలను సెట్ చేసే పనిలో పడ్డారు.
ఊహించని కాంబినేషన్
మున్నా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత బృందావనం సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు వంశీ. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు అనే సినిమాను చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు వీటన్నిటిని మించి వంశీ పైడిపల్లి మరో స్టార్ హీరోతో సినిమా చేసే పనిలో పడ్డాడు. అతను మరెవరో కాదు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ కోసం వంశీ పైడిపల్లి కథ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సిట్టింగ్స్ అయ్యాయి.. ఈ నెలాఖరున అమీర్ ఖాన్ తో ఫైనల్ సిట్టింగ్ ఉంటుందని సమచారం. ప్రస్తుతం తన టీంతో కలిసి వంశీ గోవాలో స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
దిల్ రాజు తో బాండింగ్
వంశీ పైడిపల్లి కి దిల్ రాజుతో మంచి బాండింగ్ ఉంది అందుకనే వంశీ చేసిన ప్రతి సినిమాలో దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పటివరకు దిల్ రాజు లేకుండా బయట నిర్మాతలతో సినిమాను చేయలేదు వంశీ. మున్నా సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా వంశీ పైడిపల్లికి మంచి పేరును తీసుకొచ్చాయి. వంశీ పైడిపల్లి చేసిన సినిమా ఎప్పుడు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. కేవలం తెలుగు వాళ్లతోనే కాకుండా మిగతా ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ తో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు అంటే పైడిపల్లి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ కి సంబంధించిన ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Kingdom Movie Update : ఆ పని పూర్తి చేసిన విజయ్ దేవరకొండ, మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు