Kingdom Movie Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే వరుసగా డిజాస్టర్ సినిమాలు పడినా కూడా ఫ్యాన్ బేస్ కి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది. ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాలపరంగా అదే ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు ఫెయిల్ అవుతున్న కూడా విజయ్ దేవరకొండ కి మంచి క్రేజ్ ఉంది. విజయ్ తన ఫ్యాన్స్ ని ట్రీట్ చేసే విధానం కూడా చాలామందికి నచ్చుతుంది. ఇకపోతే ప్రస్తుతం గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా మంచి అంచనాలను రేకెత్తించింది.
కింగ్డమ్ అప్డేట్
ప్రస్తుతం కింగ్డమ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ అఫ్ డబ్బింగ్ పూర్తి అయిపోయింది. ఈ సినిమా మే 30న విడుదల కానుంది. విజయ్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇదివరకే చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లు కూడా తెలిపారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ను మునుపెన్నడూ చూపించిన విధంగా గౌతం తిననూరి చూపిస్తున్నారు.
#Kingdom dubbing is progressing at a rapid pace with the first half completed ✅💥💥
The duo is all geared up to deliver a theatrical feast on the big screens this May 30th 🤙🏻🤙🏻@TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/bb8hcbyPUk
— Sithara Entertainments (@SitharaEnts) April 15, 2025
గౌతమ్ టాలెంట్
గౌతమ్ తిన్న నూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మళ్లీ రావా సినిమాతో దర్శకుడుగా పరిచయమై తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. అప్పటికే హీరోగా సుమంత్ కెరియర్ అయిపోతుంది అనుకున్న తరుణంలో సుమంత్ ని హీరోగా పెట్టి మళ్ళీ రావా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాల్యంలోని ప్రేమని అద్భుతంగా తెరకెక్కిస్తూ, చాలామందిని పాత జ్ఞాపకాల్లోకి తన సినిమాతో తీసుకెళ్లాడు గౌతమ్ తిన్ననూరి.
ఈ సినిమా తర్వాత గౌతమ్ చేసిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమా కమర్షియల్ గా కొన్నిచోట్ల ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాలో నానిని చూపించిన విధానం చాలామందికి కనెక్ట్ అయింది. వయసు అయిపోయిన తర్వాత ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న చాలామందికి, జీవితం అక్కడితో ఆగిపోదు సాధించడానికి వయసుతో సంబంధం లేదు. అంటూ ఒక కొత్త పాయింట్ ను అందర్నీ ఆకట్టుకునే విధంగా చూపించాడు గౌతమ్. తన రెండు సినిమాలతోని ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు కింగ్డమ్ తో ఏ స్థాయిలో మెప్పిస్తాడు వేచి చూడాలి.
Also Read : Nag Ashwin : ఖలేజా మూవీ డిజాస్టర్ అవ్వడానికి రీజన్ ఇదే… త్రివిక్రమ్‌నే తప్పు పట్టాడు