Ananthagiri Hills: హైదరాబాద్ నుంచి రెండు గంటలు జర్నీ చేస్తే చాలు భూలోక స్వర్గాన్ని తలపించే అనంతగిరి కొండల అందాన్ని ఆస్వాదించొచ్చు. వన్ డే ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి అనంతగిరి హిల్స్ బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా లాంగ్ డ్రైవ్స్‌ని ఇష్టపడే వారు కూడా అనంతగిరి హిల్స్‌కు వెళ్లేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అనంతగిరి హిల్స్‌కి ఏ సీజన్‌లో వెళ్తే బాగుటుందో తెలుసా..
అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి వెళ్తే పచ్చని అడవులు, పురాతన గుహలు, పొగమంచుతో నిండి ఉండే ఈ కొండలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు చాలా ఇష్టపడతారు. వీకెండ్స్‌లో కాస్త అడ్వెంచర్‌గా ఉండే ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లడం మంచిది.
హైదరాబాద్ నుండి కేవలం రెండు గంటల డ్రైవ్ దూరంలో ఉన్న అనంతగిరి కొండలు కాంక్రీట్ జంగిల్ నుండి తప్పించుకునేందుకు అవకాశాన్ని అందిస్తాయి. అనంతగిరి కొండల్లో దట్టమైన ఆకులతో కప్పబడిన రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌లు వెల్‌కమ్ చెప్తాయి. ఊటి, కొడై కెనాల్ లాగానే తెలంగాణలో కూడా కాఫీ తోటలు ఉన్నాయి. అది కూడా ఎక్కడో కాదు. అనంతగిరిలోనే ఈ తోటలు ఉన్నాయి. అందుకే అనంతగిరి కొండల దగ్గరికి వెళ్లగానే కాఫీ పువ్వుల తీపి సువాసన మైమరచిపోయేలా చేస్తాయి. అక్కడక్కడ కొండల నుంచి జాలువారే నీల్లను చూస్తే మిని జలపాతం లాగా అనిపిస్తుంది. కొండల మధ్యలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంది. ఇది 9వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక స్వర్గధామం అని నమ్ముతారు. యాత్రికులు, పర్యాటకులు కూడా ఇక్కడికి తరచుగా వెళ్తారు.
ALSO READ: ఏం వ్యూ మామా..! లైఫ్‌లో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాల్సిందే..
అనంతగిరి కొండల్లో అడవి నెమళ్లు, రకరకాల వణ్యప్రాణులు కూడా కనిపిస్తాయి. ఈ కొండలు ముసీ నదికి జన్మస్థలం అని కూడా చెబుతారు. ట్రిప్ కొంచం అడ్వెంచరస్‌గా అనిపిస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుందని అనుకునే వారు ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో అనంతగిరి కొండల్లో గైడెడ్ ట్రెక్‌లు, జిప్-లైనింగ్, క్యాంపింగ్ వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఎప్పుడు వెళ్తే బెటర్..?
అనంతగిరి కొండలు ఎల్లప్పుడూ పచ్చదనాన్ని పూసుకొని ఉన్నప్పటికీ వీటిని చూడడానికి కూడా ఒక బెస్ట్ సీజన్ ఉంటుంది. సాధారణంగా అయితే నవంబర్ నుంచి ఫిబ్రవరీ వరకు అనంతగిరి అందాలు చూసేందుకు బెస్ట్ టైం. ఉదయాన్నే పొగమంచు కమ్ముకున్నకొండల్లో, వేడి వేడి చాయ్ తాగితే లేదా, దక్కన్ వ్యూ పాయింట్స్ నుండి సూర్యాస్తమయాన్ని చూసినా వచ్చే ఆ కిక్కే వేరు.
అంతేకాకుండా అప్పుడప్పుడే తొలకరి చినుకులు పడుతున్న సమయంలో కూడా అనంతగిరి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ, వర్షకాలంలో వెళ్తే కొన్ని సార్లు ప్రకృతి సహకరించదు. అలాంటి సమయంలో కుండపోత వానలు వచ్చినా తలదాచుకోవడానికి కొంచం స్థలం కూడా ఉండదు. ఒకవేళ వానాకాలంలో వెళ్లాలి అనుకుంటే మాత్రం ముందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.