Aamir Khan:బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్(Aamir Khan) రీసెంట్ గా సినిమాలకు రిటైర్మెంట్ తీసుకోబోతున్నారనే వార్త.. ఇప్పుడు బీటౌన్ లో చాలా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ అభిమానులు అందరూ ‘మహాభారతం’ సినిమా తర్వాత అమీర్ ఖాన్ నిజంగానే రిటైర్మెంట్ తీసుకుంటారా..? ఇంత తొందరగా ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం అవసరమా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అంతేకాదు అమీర్ ఖాన్ ఇంకా సినిమాల్లో రాణించాలని, ఇప్పుడే సినిమాలు వదిలేయకూడదని కూడా పోస్టులు చేశారు.దీంతో మహాభారతం(Maha Bharatham) సినిమా తర్వాత తన రిటైర్మెంట్ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా స్పందించారు అమీర్ ఖాన్.మరి నిజంగానే అమీర్ ఖాన్ మహాభారతం సినిమా తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా..? ఆయన ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందించారు? అనేది ఇప్పుడు చూద్దాం..
రిటైర్మెంట్ పై స్పందించిన అమీర్ ఖాన్..
అమీర్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. “మహాభారతం సినిమా తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. అయితే నా మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. కానీ నేను మాట్లాడిన దాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను ఓ ఇంటర్వ్యూలో మీరు ఏదైనా సినిమా చేశాక ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నాయా అని ప్రశ్న అడగగా.. నటుడిగా నేను సంతృప్తికరమైన పాత్రలో నటిస్తే ఖచ్చితంగా సినిమాలను వదిలేస్తాను అని చెప్పాను.కానీ మహాభారతం సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతాను అని మాత్రం చెప్పలేదు. మహాభారతం సినిమా తర్వాత ఇక నేను సినిమాల్లో కనిపించనని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు.కానీ అందులో ఎలాంటి నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.
అమీర్ ఖాన్ మాటల వెనుక అంత అర్థం ఉందా?
అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా ఒక భారీ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుండి ఆ కథతో ప్రయాణం చేస్తున్నా.. బహుశా మహాభారతం సినిమా తర్వాత ఈ సినీ పరిశ్రమలో నటుడిగా నేను చేయడానికి ఏమీ లేదనే భావన నాలో కలుగుతుంది కావచ్చు అనుకుంటున్నా అని మాట్లాడారు.దీంతో చాలామంది మహాభారతం సినిమా తర్వాత అమీర్ ఖాన్ సినిమాలకు గుడ్ బై చెబుతారనే ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారానికి తాజా ఇంటర్వ్యూతో తెర దించేసారు.
అమీర్ ఖాన్ సినిమాలు..
ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par)అనే మూవీ జూన్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది.అలాగే లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) డైరెక్షన్లో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా చేసిన కూలి(Coolie) సినిమాలో తాను నటిస్తున్నట్టు అమీర్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.అంతే కాదు రజినీకాంత్ (Rajinikanth)అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు నేను వీరాభిమానిని. ఆయన సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే అమీర్ ఖాన్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చి అభిమానులను సంతోషపరిచారు.
ALSO READ:Actress Anjali: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అంజలి.. ఫోటోలు వైరల్!