Actress Anjali : నటి అంజలి (Anjali) అంటే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన పేరే. యాంకర్ గా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన అంజలి.. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడంతో చాలామంది అభిమానులు,సెలబ్రిటీలు అంజలికి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. మరి ఇంతకీ సీరియల్ ఆర్టిస్ట్ అంజలికి ఎవరు పుట్టారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మళ్లీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అంజలి..
మొగలిరేకులు సీరియల్ (Mogalirekulu Serial) ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర ఆర్టిస్టులలో అంజలి కూడా ఒకరు.ఈ సీరియల్ ద్వారా అంజలికి బుల్లితెరపై ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా ఎన్నో సీరియల్స్ లో రాణించి అలాగే యాంకర్ గా కూడా పలు షోలకి యాంకరింగ్ చేసి బుల్లితెరపై స్టార్ గా రాణించింది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి, సినిమాల్లో కూడా నటించింది. అయితే అలాంటి బుల్లితెర నటి అంజలి బుల్లితెరపై సీరియల్స్ లో రాణించే పవన్ (Pawan)ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వీరిద్దరి జోడి చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇప్పటికే వీరికి ఒక అందమైన పాప కూడా ఉంది. ఈ పాప పేరు ధన్విక(Dhanvika). కానీ అందరూ ఈమెను చందమామ అని ప్రేమతో పిలుస్తూ ఉంటారు.
ALSO READ:Producer Dil Raju: ఇండస్ట్రీని బ్రతికించుకోవడానికి దిల్ రాజు గొప్ప నిర్ణయం.. చూసి నేర్చుకోండయ్యా!
త్వరలో వీడియో రిలీజ్..
చందమామ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి, తమకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అంజలి, పవన్ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలా యూట్యూబ్ లో చందమామ(Chandamama) అనే పేరు ఫేమస్ అవ్వడంతో అంజలి కూతురుకి సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా అంజలి కూతురు అచ్చం చందమామలాగే ఎంతో క్యూట్ గా ఉంటుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉందని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పవన్ అంజలి చెప్పుకొచ్చారు. అయితే అలాంటి అంజలి మళ్లీ తల్లి కాబోతున్నాను అనే గుడ్ న్యూస్ ని రీసెంట్ గానే షేర్ చేసుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా అభిమానులతో పంచుకుంది..
అంతేకాదు ‘పూర్తి వీడియో కమింగ్ సూన్ వీ చందమామ’ అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది. అయితే ఆ వీడియోలో తనకు మళ్ళీ పాప పుట్టిందా.. లేదా బాబు పుట్టిందా అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే అభిమానులకు ఈ విషయంలో సస్పెన్స్ ని క్రియేట్ చేసి త్వరలోనే తనకి ఎవరు పుట్టారో రివీల్ చేస్తుంది కావచ్చు. ఇక అంజలి మళ్ళీ తల్లి కావడంతో ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు, సెలబ్రిటీలు కంగ్రాట్స్ అంటూ చెబుతున్నారు.
?utm_source=ig_web_copy_link