RC 16 Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా (RC 16) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఆయన సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఈ మూవీకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ని కూడా ఆల్రెడీ మేకర్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కోసం రంగంలోకి రజినీకాంత్ టీం దిగింది.
రామ్ చరణ్ కోసం రజనీకాంత్ యాక్షన్ డైరెక్టర్
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కోసం రజనీకాంత్ టీం రంగంలోకి దిగింది. యాక్షన్ డైరెక్టర్ కెవిన్ కుమార్ ‘ఆర్సి 16’ సినిమాలో మాసివ్ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన రజనీకాంత్ తో కలిసి పని చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘జైలర్’ మూవీలో రజనీకాంత్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించిన సంగతి తెలిసిందే. వాటికి కెవిన్ కుమార్ యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కోసం రంగంలోకి కెవిన్ కుమార్ దిగడంతో ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు.
‘ఆర్సి 16’ షూటింగ్ అప్డేట్
‘ఆర్సి 16’ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమా గారు పొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఈ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలనే ఆలోచనతో ఉన్నారు రామ్ చరణ్. ఆగస్టులోగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు మేకర్స్ . ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చిన చిత్ర యూనిట్ తిరిగి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసింది.
హైదరాబాదులోని బూత్ బంగ్లాలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇటీవల శివరాజ్ కుమార్ కు సంబంధించిన టెస్ట్ లుక్ ని కంప్లీట్ చేశారు. అలాగే జాన్వి కపూర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్సి 16’ టీం బీటీఎస్ పోస్టర్ ను షేర్ చేయగా తెగ వైరల్ అయింది. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమెరామన్ గా వర్క్ చేస్తున్నారు. ఇందులో జగపతి బాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ మూవీ టీచర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే యాక్షన్ డైరెక్టర్ గురించి వార్త మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.