Sree Leela : కన్నడ ముద్దుగుమ్మ యంగ్ బ్యూటీ శ్రీ లీలా(Sree Leela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందం, నటనతో యువతను ఆకట్టుకుంటూ.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో హీరో శ్రీకాంత్(Srikanth ) తనయుడు రోషన్(Roshan ) హీరోగా వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత రవితేజ (Raviteja ) ‘ధమాకా’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలకు సైన్ చేసి, ఒకే ఏడాది అత్యధిక సినిమాలను ఒప్పుకున్న హీరోయిన్గా రికార్డు కూడా సృష్టించింది. అలా ఏకంగా 9 సినిమాలకు సైన్ చేసిన శ్రీ లీల.. అందులో కొన్ని డిజాస్టర్ అవ్వగా.. మరికొన్ని పట్టాలెక్కలేదు.
శ్రీ లీల డేటింగ్ వార్తలపై హింట్ ఇచ్చిన కార్తిక్ ఆర్యన్ తల్లి..
ఇక హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో గత ఏడాది డిసెంబర్ 5న విడుదల ‘పుష్ప 2’ సినిమాలో ఏకంగా స్పెషల్ సాంగ్ లో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీ లీల. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో సినిమా చేస్తోంది. అలా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోందో లేదో అప్పుడే కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) తో ఈమె ప్రేమలో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా కార్తీక్ ఆర్యన్ తల్లి స్పందించడంతో అందరూ నిజమే అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో నటి శ్రీలీలా డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం వైరల్ అవుతున్న నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారి(Mala Tiwari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారాన్ని ఆమె నిజం చేస్తూ..”మంచి డాక్టర్ ను కోడలిగా చేసుకోవాలని ఉంది ” అంటూ ఆమె తెలిపారు. ఇకపోతే శ్రీ లీల మెడిసిన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
శ్రీ లీల సినిమాలు..
ఇకపోతే శ్రీ లీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ‘ఆషిఖీ 3’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వంలో రొమాంటిక్ మ్యూజికల్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు ఈ సినిమా ద్వారానే శ్రీ లీల బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోని మేకర్స్ విడుదల చేయగా.. అందులో కార్తీక్ , శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. మొత్తానికి అయితే బాలీవుడ్లో అడుగుపెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమా హీరోతోనే డేటింగ్ చేస్తోందంటూ వార్తలు రావడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి ఈ వార్తలకు శ్రీ లీల ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. ఇకపోతే శ్రీ లీల విషయానికి వస్తే ఈమె పెళ్లికాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది అంటే 21 సంవత్సరాలు వయసులోనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని , ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ మంచి మనసు చాటుకుంటుంది శ్రీ లీల .ఇక ఈమె తల్లి గైనకాలజిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు 23 ఏళ్ల వయసు ఇప్పుడే పెళ్లి అంటే ఈమె కెరియర్ చాలా ఉంది అని నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై శ్రీ లీల స్పందన ఏంటో తెలియాల్సి ఉంది.
Rajinikanth: 75 ఏళ్ళ వయసులో సూపర్ స్టార్ సాహసం.. గ్రేట్ గురూ..!