BigTV English

Harshal Patel: ఆస్పత్రిలో చేరిన SRH ప్లేయర్… అసలు ఏమైందంటే ?

Harshal Patel: ఆస్పత్రిలో చేరిన SRH ప్లేయర్… అసలు ఏమైందంటే ?

Harshal Patel: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హర్షల్ పటేల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతన్ని హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో… అడ్మిట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే తీవ్ర అనారోగ్యంతో సతమతమయ్యారు హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్.


Also Read: PBKS Fan Angry: పంజాబ్ ప్లేయర్లను బండ బూతులు తిట్టిన లేడి.. వీడియో వైరల్..!

దీంతో వెంటనే హర్షల్ పటేల్ ను హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారని సమాచారం అందుతుంది. తీవ్ర జ్వరం అలాగే… బాడీ పెయింట్స్ తో హర్షల్ పటేల్ బాధపడుతున్నట్లు… వార్తలు వస్తున్నాయి. అతనికి ఫుడ్ పాయిజన్ అయిందని కూడా చెబుతున్నారు. ఇందులో ఏది వాస్తమో తెలియదు కానీ… హైదరాబాద్ స్టార్ ఆటగాడు హర్షల్ పటేల్ జట్టులో ఆదివారం రోజున మ్యాచ్లో లేకపోవడం.. పెద్ద మైనస్ అయింది.


హర్షల్ పటేల్ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్ళం

ఆదివారం రోజున గుజరాత్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా… హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. అయితే నిన్నటి మ్యాచ్ లో సన్రైజర్స్ ఆటగాడు హర్షల్ పటేల్ జట్టులో ఉంటే బాగుండేదని… అతను జట్టులో లేకపోవడం వల్ల హైదరాబాద్ ఓడిపోయిందని కొంతమంది అంటున్నారు. గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించింది. ఇది కంప్లీట్ గా స్లో పిచ్.

అయితే స్లో పిచ్ లపై హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. నిజంగానే హర్షల్ పటేల్ ఆడుంటే… నిన్న గుజరాత్ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు. అతను లేకపోవడం వల్ల హైదరాబాద్ కు ఎదురు దెబ్బ తగిలింది. అయితే రెండు రోజులపాటు అతను ఆసుపత్రిలోనే ఉండాలని చెబుతున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ జట్టులో చేరిపోతారు. ఇది ఇలా ఉండగా… గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ విభాగాలలో దారుణంగా విఫలమైన హైదరాబాద్…. వరుసగా నాలుగవ ఓటమిని చవిచూసింది. దీంతో పాయింట్లు పట్టికలో కూడా చిట్ట చివరన నిలిచింది.

Also Read: SRH VS GT: బ్యాటింగ్ చేయనున్న SRH.. కాటేరమ్మ కొడుకులు ఉంటారో… పోతారో

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో… ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్… వరుసగా చివరి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. కేవలం రాజస్థాన్ రాయల్స్ జట్టు పైన విజయం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్. దీంతో పాయింట్ల పట్టికలో… పదవ స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఇదే తరహాలో హైదరాబాద్ ఆడితే… ఇంటికి వెళ్లడం గ్యారంటీ. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా… హైదరాబాద్ దంచి కొట్టాల్సి ఉంది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×