New Movie: ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా చాలా భిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు ఒకే కోవకు చెందిన సినిమాలు కాకుండా విభిన్న జానర్ లో సినిమాలు చేస్తూ, ఆ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ, మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు అద్భుతమైన క్లైమాక్స్ లతో ముగింపు పలకగా మరికొన్ని సినిమాలు కొనసాగింపుగా సీక్వెల్స్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఒక సినిమాకు ఓకే ముగింపు ఉండటం మనం చూసాము కానీ ఒక సినిమాకు రెండు క్లైమాక్స్ (Two Climaxes) లు ఉండటం ఇదివరకు ఎప్పుడు వినలేదు.
మొట్టమొదటి చిత్రం…
తాజాగా ఓకే సినిమాకు రెండు క్లైమాక్స్ లతో ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) నాయకత్వంలో రూపొందుతున్న కామెడీ ఫ్రాంచైజీలో ‘హౌస్‌ఫుల్ 5′(House Full 5) ఐదవ భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 6వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమాలో రెండు క్లైమాక్స్ లు ఉంటాయని విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెండు క్లైమాక్స్ లతో హౌస్ ఫుల్ 5…
ఇలా ఒక సినిమాకు ఓకే ముగింపు ఉండటం సర్వసాధారణం కానీ రెండు క్లైమాక్స్ లతో హౌస్ ఫుల్ 5 మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానా పటేకర్, సంజయ్ దత్ మరియు జాకీ ష్రాఫ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రంజిత్ అనే ఒక బిలీనీయర్ ఒక లగ్జరీ క్రూయిజ్‌లో హత్యకు గురవుతారు. తనని ఎవరు హత్య చేశారనే సస్పెన్షన్ తో ఈ సినిమా మొత్తం నడుస్తుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా హౌస్ ఫుల్ 5A, హౌస్ ఫుల్ 5B గా రెండు వర్షన్ లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హౌస్ ఫుల్ 5A స్క్రీన్ పై ఈ సినిమాని చూసినప్పుడు ఒక క్లైమాక్స్,హౌస్ ఫుల్ 5B స్క్రీన్ పై చూసినప్పుడు మరొక క్లైమాక్స్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇలా రెండు క్లైమాక్స్ లతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందనేది తెలియాలి అంటే మనం థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి ఒక విభిన్నమైన ప్రకటనతో సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇలా రెండు క్లైమాక్స్ లతో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అందుకొని ముందు ముందు ఇలాంటి సినిమాలకు ఆజ్యం పోస్తుందా?లేక ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదుర్కొంటుందా ?అనేది తెలియాల్సి ఉంది.