Jagapathi Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా నటిస్తూ ఎంతో బిజీగా, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు “మంచి మనుషులు” అనే సినిమాతో బాలనటుడిగా అడుగుపెట్టి అనంతరం “సింహస్వప్నం” సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఈయనకు శుభలగ్నం సినిమా ద్వారా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు.
అవకాశాలను కోల్పోయారు…
ఇలా హీరోగా ఒకానొక సమయంలో ఎంతో బిజీగా గడిపిన జగపతిబాబు క్రమక్రమంగా సినిమా అవకాశాలను కోల్పోయారు. దీంతో ఈయన ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇలా తన కెరియర్ క్లోజ్ అయిందనే టైంలో బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో విలన్(Villain) పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఇలా విలన్ పాత్రల ద్వారా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన జగపతిబాబు ఇప్పుడు మాత్రం కెరియర్ పరంగా ఇతర భాషలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఈయన హీరోగా సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్న దానికంటే కూడా విలన్ గానే ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు.
విలన్ పోలికలు….
ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పే నైజం జగపతిబాబుది. అందుకే ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన ఇంట్లో పనులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను కూడా ఈయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా జగపతిబాబు ఒకప్పటి తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Ippudu anipisthundhi.. puttattammey villain pollikalu tho puttaanani pic.twitter.com/JAwEpk5ewO
— Jaggu Bhai (@IamJagguBhai) June 1, 2025
ఇలా ఒకప్పటి ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటోను కూడా ఈయన షేర్ చేస్తూ… ఇప్పుడు అనిపిస్తుంది మనం పుట్టడమే విలన్ పోలికలతో పుట్టానని అంటూ చెప్పకు వచ్చారు. అయితే ఈ ఫోటోలో అచ్చం విలన్ తరహా లుక్ కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… విలన్ పాత్రలకు మీరు పర్ఫెక్ట్ అని ఇన్ని రోజులకు అర్థమయిందా సర్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం మీరు ఏ పాత్రలలోనైనా ఇట్టే ఇమిడిపోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో మీరు వీరప్పన్ అమ్మ కొడుకులాగా ఉన్నారు అంటూ కూడా మరి కొంతమంది అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం జగపతిబాబు తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.