Allu Arha: అల్లు అర్హ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అల్లు అర్జున్ ముద్దుల తనయ.. అల్లు వారింటి గారాల పట్టి. సాధారణంగా స్టార్ కిడ్స్ పెరిగేకొద్ధి స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. కానీ అర్హ మాత్రం పుట్టినప్పటినుంచే స్టార్ గామారింది . ఇక బన్నీతో అర్హ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అర్హ ముద్దు ముద్దు మాటలను రికార్డ్ చేసి అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. పెద్దవాడు అయాన్ కన్నా కూడా అర్హకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.
నిజం చెప్పాలంటే.. ఇప్పుడున్న స్టార్ కిడ్స్ అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. కానీ, బన్నీ పిల్లలు మాత్రం ఎప్పుడు అచ్చ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా అర్హ పాప అయితే ఎంతో చక్కగా తెలుగు పలుకులు పలుకుతూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి.. నందమూరి బాలకృష్ణకే ముచ్చెమటలు పట్టించింది. అల్లు అర్జున్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లిన విషయం తెల్సిందే.
Telugu Producers : పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు… ఆ నిర్మాత అసలు ఏం చేస్తున్నాడు..?
గతవారం బన్నీ కి సంబంధించిన ఎపిసోడ్ పార్ట్ 1 రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ పార్ట్ 1 లో బాలయ్య.. బన్నీని ముప్పుతిప్పలు పెట్టాడు. బన్నీ తల్లి నిర్మలమ్మ గారిని పిలిచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అడిగి తెలుసుకున్నాడు. బన్నీ కెరీర్, ఒడిదుడుకులు అన్ని ఈ ఎపిసోడ్ లో చూపించారు. ఇక పార్ట్ 2 లో అంతకుమించిన రచ్చ ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా పార్ట్ 2 ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బన్నీ పిల్లలు అయాన్, అర్హ సందడి చేశారు. బాలయ్య వారిని ఎంతో ముద్దు చేశాడు.
ఇక ఈ ప్రోమోలో అర్హకు తెలుగు వచ్చా అని బాలయ్య అడగ్గా.. బన్నీ, తెలుగు వచ్చా అని అనగానే అర్హ ఒక తెలగు పద్యాన్ని అందుకుంది. ” అటజని కాంచె భూమిసురు డంబర చుంబిర” అంటూ గుక్కతిప్పుకోకుండా పద్యాన్ని మొత్తం అప్పజెప్పేసింది. సాధారణంగా అలా గుక్కతిప్పుకోకుండా బాలయ్య పద్యాలు పాడతాడు అన్న విషయం తెల్సిందే. ఆయనే ముందే భయం లేకుండ పద్యాన్ని మొత్తం అప్పజెప్పేసింది . ఇక ఆమె తెలుగును చూసి బాలయ్య షాక్ అయ్యాడు.
Mechanic Rocky Trailer 2.0 : పస లేదు… రెండోది వచ్చినా అదే రోటీన్ మ్యాటర్
అర్హను ముద్దుపెట్టుకొని తెలుగు చల్లగా.. నాలుగు కాలాల పాటు హాయిగా.. ఈ భూమ్మీద బతుకుతుంది అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇక కేవలం బాలయ్య మాత్రమే కాదు నెటిజన్స్ మొత్తం అర్హ తెలుగు విని ప్రశంసిస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో ఆ చిన్నారి తెలుగు పద్యాలను గుర్తుపెట్టుకొని చెప్పడం, పిల్లలకు ఇంట్లో తెలుగు నేర్పించడం చాలా మంచి విషయమని పోగిడేస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.