Mechanic Rocky Trailer 2.0 : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “మెకానిక్ రాకీ” (Mechanic Rocky). మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వం వహించారు. రామ్ తాళ్ళూరి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
“మెకానిక్ రాకీ” సినిమా నుంచి ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కానీ సినిమాపై అది ఏమాత్రం బజ్ పెంచలేకపోయింది. “మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0” (Mechanic Rocky Trailer 2.0) అంటూ ఇప్పుడు రెండో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదివరకే విశ్వక్ సేన్ సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే నవంబర్ 22న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో తాజాగా మరో కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కానీ రెండవ ట్రైలర్ పై కూడా పెదవి విరుస్తున్నారు మూవీ లవర్స్.
ఫస్ట్ ట్రైలర్ ఎలాగూ ఆకట్టుకోలేదు. కనీసం రెండవ ట్రైలర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుంటే ఏమాత్రం పసలేని ట్రైలర్ ను వదిలారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ లో ఆసక్తికరంగా లేదా కొత్తగా ఏమీ కన్పించలేదు. అదే రొటీన్ కమర్షియల్ ఫార్ములా, పాత కథ కన్పిస్తోంది. ఇక ఆదివారం జరిగిన “మెకానిక్ రాకీ 2.0” (Mechanic Rocky Trailer 2.0) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అలాగే కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశారు.
మరోవైపు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కథ నచ్చడంతో విశ్వక్ వెంటనే ఈ సినిమాను ఓకే చెప్పాడని, కానీ రీసెంట్ గా ఫైనల్ అవుట్ పుట్ చూసాకా విశ్వక్ సేన్ కు ఈ మూవీ అసలు నచ్చలేదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది విశ్వక్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కాగా, అందులో ఒక్కటి కూడా హిట్ పడలేదు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కు హాజరుకాలేనని విశ్వక్ నిర్మాతలకు చెప్పడంతో చిన్న వివాదం కూడా జరిగిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
మొత్తానికి ఎలాగోలా హీరోని ప్రమోషన్స్ కి తీసుకొచ్చినప్పటికీ, ఈ సినిమాకు ఎలాగైనా మంచి ఓపెనింగ్స్ రావాలని విశ్వక్ కాంట్రవర్సీ కామెంట్స్ స్ట్రాటజీతో బజ్ పెంచే ప్రయత్నం చేశారని అంటున్నారు. కానీ ఇంత చేసినప్పటికీ సినిమాపై ఏమాత్రం క్యూరియాసిటీ క్రియేట్ కాలేదు. కనీసం తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా బజ్ పెంచలేకపోయింది. మూవీ రిలీజ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. మరి ఈ నాలుగు రోజుల్లో జనాలను థియేటర్లకు రప్పించగలిగే ప్లాన్ ఏదన్నా “మెకానిక్ రాకీ” (Mechanic Rocky) దగ్గర ఉందా? అనేది చూడాలి. లేదంటే ఈ మూవీతో విశ్వక్ సేన్ ఖాతాలో మరో డిజాస్టర్ పడినట్టే అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. పైగా ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు విన్పిస్తున్నాయి. కానీ పెయిడ్ ప్రీమియర్లు అంటే ఖచ్చితంగా కంటెంట్ బాగుంటేనే వర్కౌట్ అవుతుంది. లేదంటే పూర్తిగా ఈ స్ట్రాటజీ బెడిసికొడుతుంది. మరి “మెకానిక్ రాకీ” విషయంలో ఏం జరుగుతుందో !?