Allu Arjun :అల్లు అర్జున్ (Allu Arjun).. పేరు కాదు బ్రాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో కెరియర్ మొదలుపెట్టి, తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సహాయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత స్వతహాగా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక సుకుమార్ (Sukumar ) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాతో ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ముఖ్యంగా సౌత్ వరకే పరిమితమైన ఆయన ఈ సినిమాతో నార్త్ లో ఊహించని మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని టాలీవుడ్ లో తొలిసారి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు బన్నీ.
పుష్పరాజ్ కి ఘోర అవమానం..
ఇక తర్వాత అదే జోష్ లో ‘పుష్ప 2’ సినిమా చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అప్పటి వరకు ఉన్న రికార్డ్లన్నింటినీ కొల్లగొట్టారు. ముఖ్యంగా ఇందులో ‘పుష్పరాజ్’ గెటప్ లో అల్లు అర్జున్ చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించారనే చెప్పాలి. ఈ గెటప్ అల్లు అర్జున్ కి తప్ప ఇంకొకరికి సూట్ కాదు అన్న రేంజ్ లో అల్లు అర్జున్ నటించారు. ఇకపోతే ఈ సినిమాతో అంత పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కి అమెరికాలో ఒక హోటల్ ముందు ఘోరమైన అవమానం జరిగిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే, సాధారణంగా రెస్టారెంట్ ఓనర్లు లేదా షాపింగ్ మాల్స్ ఓనర్లు కస్టమర్లను ఆకర్షించడానికి బయట కార్టూన్స్ ను ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇంత బతుకు బతికి చివరికి రెస్టారెంట్ ముందు..
అయితే ఇక్కడ అనూహ్యంగా కార్టూన్స్ కి బదులు పుష్పరాజ్ నే నిలబెట్టారు ఒక హోటల్ రెస్టారెంట్ యాజమాన్యం. అసలు విషయంలోకి వెళ్తే అమెరికాలో ‘ఇండియా భవన్’ అనే ఒక రెస్టారెంట్ ముందు.. పుష్పరాజ్ గెటప్ లో ఉన్న ఒక బొమ్మను ఏర్పాటు చేసి, ఆ రెస్టారెంట్ కి వచ్చి పోయే కష్టమర్లను ఆహ్వానించేలా డిజైన్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ ఇంత బతుకు బతికి పుష్పరాజ్ కి ఎంత కష్టం వచ్చిందేంటి? హవ్వా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనపై కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది అమెరికాలో పుష్పరాజ్ హవా ఈ రేంజ్ లో దిగజారిందా అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
also read:Tollywood Movie Shooting Updates: ఏ మూవీ ఎక్కడ షూటింగ్ జరుగుతోందో తెలుసా..?
అల్లు అర్జున్ సినిమాలు..
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో #AA 22 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalhanidhi maran) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.175 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. మరోవైపు కేవలం వీ.ఎఫ్.ఎక్స్ కోసమే రూ.250 కోట్ల కేటాయిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ త్రివిక్రమ్ (Trivikram) తో సినిమా చేసి, ఆ తర్వాత ‘పుష్ప 3’ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pushparaj in USA 😝😃 pic.twitter.com/lxtuVN37Mn
— Christopher Kanagaraj (@Chrissuccess) May 12, 2025