BigTV English

NTR YVS Chowdary Movie: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎన్టీఆర్ కొత్త మూవీ స్టార్ట్..

NTR YVS Chowdary Movie: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. ఎన్టీఆర్ కొత్త మూవీ స్టార్ట్..

NTR YVS Chowdary Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఆయన తర్వాత తరంగా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మరింత వరసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. బాలయ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫామ్ లో ఉన్నారు. ఇక ఈ మధ్య బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ కుటుంబం నుంచి మరో ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ కొత్త హీరో మూవీ షూటింగ్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యింది. ఆ కొత్త మూవీ షూటింగ్ వివరాలు తెలుసుకుందాం..


నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ..

తెలుగు చిత్రం పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ హీరోలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు.. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూజా కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ లోని పలువురు ప్రముఖులు, అలాగే సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరయ్యారు.. వీరితోపాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.. ఈ మూవీతో హీరో సక్సెస్ అవ్వాలని అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కూడా యంగ్ హీరో ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుతున్నారు..


న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్ పై డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా ఆయన భార్య గీత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇద్దరినీ తెలుగు ఇండస్ట్రీకి ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పరిచయం చేయనున్నారు. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. మరో ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగులు రాస్తున్నారని తెలుస్తుంది.

Also Read : 5 కోట్ల స్కాం.. నేడు విచారణకు మహేష్ బాబు… ఈ సారి కూడా డుమ్మా..?

ఈ స్టోరీ విషయానికొస్తే..

ఈమధ్య కొత్త హీరోలు రెండు కు తగ్గట్లు సినిమాలు చేయాలని కథలను ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ సినిమా మాత్రం 1980 కథతో రాబోతుందట. తెలుగు భాష గొప్పతనం, సాహిత్యం, సంస్కృతి ల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఎంతోమంది హీరోలను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఫోర్త్ జనరేషన్ యంగ్ ఎన్టీఆర్ను పరిచయం చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి నెలకొంది.. ఈ సినిమా హిట్ అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సక్సెస్ హీరో ఇండస్ట్రీకి దొరికినట్లే. మరి ఈ హీరోకి ఈ సినిమా ఏ మాత్రం టాక్ను అందిస్తుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×