BigTV English

Silk Smitha: సిల్క్ స్మిత పెట్టుకునే బ్లాక్ గ్లాసెస్ వెనుక ఇంత రహస్యం ఉందా..?

Silk Smitha: సిల్క్ స్మిత పెట్టుకునే బ్లాక్ గ్లాసెస్ వెనుక ఇంత రహస్యం ఉందా..?

Silk Smitha.. సిల్క్ స్మిత.. ఈ పేరుకి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈ తరం ఆడియన్స్ కి ఈమె గురించి పెద్దగా తెలియకపోయినా.. 90స్ యువతకు ఈమె అంటే మహా క్రేజ్. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తోంది అంటే ఈమె కోసమే సినిమా చూసిన ఆడియన్స్ కూడా లేకపోలేదు. అంతలా తన నటనతో.. కంటి చూపుతో యువతను దాసోహం చేసుకునేది. సిల్క్ స్మిత కెరియర్లో పీక్స్ లో ఉన్నప్పుడే మరణించడం ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. సిల్క్ స్మితను కొంతమంది మోసం చేసి, ఆమె డబ్బును లాక్కొని, ఆమెను చంపేశారు అని చెబుతూ ఉంటారు. మరి కొంత మంది ఆమెను బిల్డింగ్ నుంచి తోసేశారు అంటారు. ఇంకా కొంతమంది ఆమె మత్తుకు బానిస అయ్యి ఆత్మహత్య చేసుకుంది అని ఇలా పలు రకాల కారణాలతో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈమె మరణానికి గల కారణం మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత మరణించినప్పుడు కేవలం శాండిల్ వుడ్ హీరో అర్జున్ (Arjun ) తప్ప ఎవరు అక్కడ కనిపించకపోవడంతో ఇండస్ట్రీ ఎందుకు ఈమె పట్ల కఠినంగా ప్రవర్తించింది?అని అభిమానులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.


నా కెరియర్ లో ఆ పాట ఎప్పటికీ ప్రత్యేకమే – బాబూ మోహన్

ఇలాంటి సమయంలో సీనియర్ కమెడియన్, ప్రముఖ నటులు, రాజకీయ వేత్త అయిన బాబు మోహన్ (Babu Mohan) ఈమె వ్యక్తిత్వం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఈమె ఎప్పుడు? ఎక్కడ కనిపించినా బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కనిపించేది. ప్రత్యేకించి ఆ బ్లాక్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటుంది? దానిని పెట్టుకోవడం వెనుకున్న అసలు కారణం ఏంటి? అనే విషయాలను కూడా తెలిపారు బాబు మోహన్. తాజాగా ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ మాట్లాడుతూ.. అప్పట్లో నేను చేసిన పాటలు మంచి సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ సినిమాల వరుసలో “బావలు సయ్యా” పాట కూడా కనిపిస్తుంది. ఆ ఒక్క పాట కోసమే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు. ముఖ్యంగా ఆ సినిమాలో సిల్క్ స్మిత చాలా అద్భుతంగా నటించింది.”


దానికోసమే సిల్క్ స్మిత బ్లాక్ గ్లాసెస్ ధరిస్తుంది – బాబూ మోహన్

” సిల్క్ స్మిత ను ఎప్పుడు చూసినా సరే బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకొని కాలుపై కాలు వేసుకొని కూర్చునేది. ఎవరిని కూడా ఆమె కేర్ చేసేది కాదు. హీరోలు వచ్చినా అలాగే కూర్చుంటావా? అని నేను అడిగితే.. హీరోలు వస్తే పైకి లేవాలా? అంటూ నన్నే ఎదురు ప్రశ్నించింది. బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడానికి కారణం ఏమిటి అని అడిగితే.. నన్ను ఎవరు చూస్తున్నారన్నది గమనించడం కోసమే నేను గ్లాసెస్ పెట్టుకుంటాను బాస్.. అని నాతో అన్నది. నన్ను బాస్ అని పిలుస్తూ నాతో చాలా ఆత్మీయంగా ఉండేది. ఒకసారి సినిమా షూటింగ్లో భాగంగా దుబాయ్ కి వెళ్తే.. అక్కడ షాపింగ్ కోసం నన్ను రమ్మంటే, తోడుగా వెళ్లాను. ఇక అక్కడ స్పెక్స్ చూపించి ఇవి ఎలా ఉన్నాయి? అని అడిగింది. దానికి నేను బాగున్నాను చెబితే నాకు అవే బహుమతిగా ఇంచింది. ఇప్పటికీ అవి నా వద్ద ఉన్నాయి. వాస్తవానికి ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం సిల్క్ స్మిత కాదు.. ఆమె వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం ” అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

Surekha – Supritha: బీచ్‌లో బికినీతో తల్లీకూతుళ్లు రచ్చ.. ఆసక్తి రేపుతోన్న కొటేషన్..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×